భరోసా ఇస్తున్నా.. వర్రీలో మహేష్ ఫ్యాన్స్..?

నిర్మాత రంగంలోకి దిగి భరోసా ఇచ్చాడు. రీసెంట్‌గా సినిమాటోగ్రాఫర్ కూడా భయం లేదన్నట్లు చెప్పేశాడు. అయినా మహేష్ బాబు ఫ్యాన్స్‌ వర్రీగానే ఉన్నారట. అసలు మహేష్‌ సినిమాకు ఏమైంది..? అభిమానులను వెంటాడుతోన్న వర్రీ ఏంటి..? అనుకుంటున్నారా..! అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సెట్స్ మీదకు వెళ్లినప్పడు పాజిటివ్‌గా ఉన్న ఈ మూవీపై ఉన్నట్లుండి […]

భరోసా ఇస్తున్నా.. వర్రీలో మహేష్ ఫ్యాన్స్..?
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Nov 08, 2019 | 4:24 PM

నిర్మాత రంగంలోకి దిగి భరోసా ఇచ్చాడు. రీసెంట్‌గా సినిమాటోగ్రాఫర్ కూడా భయం లేదన్నట్లు చెప్పేశాడు. అయినా మహేష్ బాబు ఫ్యాన్స్‌ వర్రీగానే ఉన్నారట. అసలు మహేష్‌ సినిమాకు ఏమైంది..? అభిమానులను వెంటాడుతోన్న వర్రీ ఏంటి..? అనుకుంటున్నారా..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సెట్స్ మీదకు వెళ్లినప్పడు పాజిటివ్‌గా ఉన్న ఈ మూవీపై ఉన్నట్లుండి నెగిటివ్‌ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ మ్యూజిక్ విషయంలో అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మధ్య గొడవలు జరిగాయని.. ఇందులోని పాటలు మొత్తం మార్చాలని మహేష్, దేవీకి సూచించాడని పుకార్లు వినిపించాయి. ఇక మరోవైపు బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా.. ‘సరిలేరు’లోని పాటలు ఆ రేంజ్‌లో లేవని అందుకే దర్శకుడు ఇంతవరకు పాటలను విడుదల చేయలేదని టాక్ వినిపించింది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు మూవీ నిర్మాత అనిల్ సుంకర రంగంలోకి దిగాడు.

”దేవీ ఇచ్చిన మాస్ పాటను విన్నాను. దానికి కేక అనే పదం చాలా చిన్నదవుతుంది. దేవీ తన మాటను నిలబెట్టుకున్నాడు. మహేష్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి” అంటూ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇక తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ఈ సినిమా పాటలపై స్పందించాడు. ”నేను విన్న రెండు పాటలు పెద్ద హిట్‌గా నిలుస్తాయని.. రిపీట్ మోడ్‌లో విన్నానని” కితాబిచ్చాడు. అయితే వీరు ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నా.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం వర్రీగానే ఉన్నారట. అసలు పాటలు ఎలా ఉండబోతున్నాయో అని ఫీల్ అవుతున్నారట. దీనికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా దేవీ శ్రీ విషయంలో స్పందించకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారట. ఇదిలా ఉంటే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు మహేష్ టీమ్ కూడా రెడీగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 1 నుంచి సింగిల్స్‌ను విడుదల చేయాలని సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu