లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?

లోకనాయకుడు కమల్‌హాసన్ గురువారం 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో సహా తన స్వగ్రామం పారమకుడికి వెళ్లిన కమల్.. అక్కడ తన తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కమల్ తనయలిద్దరు సందడి చేశారు. వారితో పాటు కమల్ సోదరుడు చారు హాసన్, ఆయన కుమార్తె సుహాసిని మణిరత్నం కూడా కమల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ […]

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆ హీరోయిన్‌తో కమల్ డేటింగ్..?
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 12:56 PM

లోకనాయకుడు కమల్‌హాసన్ గురువారం 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో సహా తన స్వగ్రామం పారమకుడికి వెళ్లిన కమల్.. అక్కడ తన తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కమల్ తనయలిద్దరు సందడి చేశారు. వారితో పాటు కమల్ సోదరుడు చారు హాసన్, ఆయన కుమార్తె సుహాసిని మణిరత్నం కూడా కమల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఆ ఫొటోలో కమల్ ఫ్యామిలీతో పాటు యంగ్ హీరోయిన్ పూజా కుమార్ కూడా ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ మూడు చిత్రాల్లోనూ పూజా కుమార్ నటించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు కమల్‌తో గౌతమి విడిపోయిన సమయంలోనూ పూజా కుమార్ పేరు వినిపించింది. ఆమెతో కమల్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే గౌతమి, అతడితో విడిపోయినట్లు పుకార్లు వినిపించాయి. ఇక ఇటీవల విక్రమ్ హీరోగా కమల్ నిర్మించిన ‘కదరమ్ కోండ్రన్’ స్పెషల్ స్క్రీనింగ్‌లోనూ ఆమె లోకనాయకుడితో కలిసి కనిపించింది. ఇక తాజాగా హాసన్ ఫ్యామిలీ ఫొటోలో కూడా ఆమె ఉండటంతో.. కమల్‌, పూజా మధ్య ఏమైనా నడుస్తుందా..? అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. మరి నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఉందా..? హాసన్ ఫ్యామిలీ ఫొటోలో పూజా ఎందుకు ఉంది..? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పూజా కుమార్ తెలుగులో రాజశేఖర్ సరసన ‘పీవీఎస్ గరుడ వేగ’లో కనిపించిన విషయం తెలిసిందే.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.