Vijay Devarakonda: ఇది కదా అసలైన హీరోయిజం అంటే.. తనను దూషించిన థియేటర్ యజమానికి విజయ్ పాదాభివందనం..
Vijay Devarakonda: 'నాకు విజయ్‌లో నచ్చింది అతని నిజాయితీ. బయట మాటల్లోనే కాదు, యాక్టింగ్‌లోనూ అంతే నిజాయితీ ఉంటుంది. మీరు సినిమాలో చూడండి ఎంత ఎలివేషన్ పెట్టినా ఇంత పొగరు కనిపించదు...
Vijay Devarakonda: ‘నాకు విజయ్‌లో నచ్చింది అతని నిజాయితీ. బయట మాటల్లోనే కాదు, యాక్టింగ్‌లోనూ అంతే నిజాయితీ ఉంటుంది. మీరు సినిమాలో చూడండి ఎంత ఎలివేషన్ పెట్టినా ఇంత పొగరు కనిపించదు, అతని కోపం కూడా నిజాయితీగా ఉంటుంది’ ఇవి లైగర్ ఫాండమ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వరంగల్‌లో జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే పూరీ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షరసత్యం అనిపించక మానవు. తనను దూషించిన వ్యక్తి దగ్గరికే వెళ్లి ఏకంగా పాదాభివందనం చేశాడు రౌడీ హీరో.
ఇంతకీ విషయమేంటంటే.. లైగర్ సినిమా విడుదల తర్వాత ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండపై పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతడు కొండ కాదు అనకొండ అంటూ నామా మాటలు అన్నాడు. అయితే సహజంగా ఎవరైనా తన గురించి ఇలా మాట్లాడిన వ్యక్తిని జీవితంలో కలవకూడదనే అనుకుంటారు. కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. పూరీ చెప్పినట్లు నిత్యం గ్రౌండ్ టు ఎర్త్ ఉండే విజయ్.. తాజాగా ఆ థియేటర్ యజమానికి కలుసుకున్నాడు. కలవడమే కాదు అతన్ని మనస్ఫూర్తిగా హత్తుకొని, కాళ్లకు నమస్కరించాడు. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందు అసలు తాను ఏం మాట్లాడానో వివరించి పూర్తి వీడియోను చూపించాడు.
Manoj Desai was all praise for #VijayDevarakonda, stating, “He is a really very nice guy, down to earth, I will keep loving him always. He has got a bright future and I promise hereby, I will take all his pictures. I wish him all the best”@TheDeverakonda pic.twitter.com/QHYat52A2g
— Ashwani kumar (@BorntobeAshwani) August 28, 2022
దీంతో అసలు విషయం తెలుసుకున్న థియేటర్ యజమాని మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్‌లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ప్రస్తుతం విజయ్, ఆ థియేటర్ యజమాని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ నిరాడంబరతను చూసిన ఆ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హీరో అంటే ఇలా ఉండాలి అంటూ ఒకింత ఉప్పొంగిపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..