Tina Turner: కుర్రకారును ఉర్రూతలూగించిన రాకెన్‌ రోల్‌ క్వీన్ ‘టీనా టర్నర్‌’ ఇకలేరు

Srilakshmi C

Srilakshmi C |

Updated on: May 26, 2023 | 12:18 PM

లెజెండరీ పాప్‌ సింగర్‌, రాకెన్‌ రోల్‌ క్వీన్ టీనా టర్నర్‌ (83 ) ఇకలేరు. సుదీర్థకాలంలా అనారోగ్యంగా బాధపడుతున్న టీనా.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ సమీపంలోని ఆమె నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా టీనా మేనేజర్‌గా ఉన్న రోజర్ డేవిస్..

Tina Turner: కుర్రకారును ఉర్రూతలూగించిన రాకెన్‌ రోల్‌ క్వీన్ 'టీనా టర్నర్‌' ఇకలేరు
Tina Turner

Follow us on

లెజెండరీ పాప్‌ సింగర్‌, రాకెన్‌ రోల్‌ క్వీన్ టీనా టర్నర్‌ (83 ) ఇకలేరు. సుదీర్థకాలంలా అనారోగ్యంగా బాధపడుతున్న టీనా.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ సమీపంలోని ఆమె నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా టీనా మేనేజర్‌గా ఉన్న రోజర్ డేవిస్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన ఆటపాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన టీనా టర్నర్‌ 1960లు, 70లలో ఓ వెలుగు వెలిగారు. మిక్‌ జాగర్‌ మొదలుకుని బేయాన్స్‌ దాకా రాక్‌ స్టార్లంతా టీనా వీరాభిమానులే. సులువుగా సాగని వైవాహిక జీవితం టీనా టర్నర్‌ కుంగుబాటుకు గురి చేసింది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో వేదన అనుభవించిన టీనా జీవితం ఆద్యంతం ఆసక్తికరం. వీటన్నింటినీ అధిగమించి పాప్‌ మ్యూజిక్‌ ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా ఎదిగారు. ఏకంగా 12 గ్రామీ అవార్డులు ఆమెను వరించాయంటే టీనా పాటలకు ఉన్న ఇమేజ్‌ ఏపాటిదో ఆర్థం చేసుకోవచ్చు. అందుకే మ్యూజిక్‌ ప్రియులు ‘క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా ఆమెను పిలుస్తారు.

ఆమె ఆల్బంలు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లకు పైగా అమ్ముడయ్యి రికార్డు సృష్టించాయి. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత గాథ ‘వాట్స్‌ లవ్‌ గాట్‌ టు డూ వితిట్‌’ పేర 1993లో సినిమా కూడా విడుదలైంది. అందులో టీనా నటి ఏంఎలా బాసెట్‌ అద్భుతంగా నటించారు. గుండెలు బద్దలయ్యే బాధను మునిపంటి కింద నొక్కిపట్టి.. ప్రపంచం అబ్బురపడేలా ఎదిగింది. టీనా మరణం యావత్‌ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో మునిగిపోయారు. ‘ప్రైవేట్ డ్యాన్సర్’, ‘ది బెస్ట్’, ‘ప్రౌడ్ మేరీ’, ‘ఫూల్ ఇన్ లవ్, ‘ఇట్స్ గొన్నా వర్క్ అవుట్ ఫైన్’ వంటి ఎన్నో పాపులర్ ఆల్బమ్‌లు టీనా గొంతు నుంచి జాలువాలిన స్వర పుష్పాలు. టీనా మరణం పట్ల అభిమానులు, ప్రముఖ వ్యక్తులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu