AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deewana OTT : కుర్రాళ్లను కట్టిపడేసిన సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన దీవానా..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త సినిమాలతో, సిరీస్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ రెండు రాష్ట్రాల్లో టాప్ ఓటీటీ సంస్థగా రాణిస్తున్న ఆహా ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలతో ఆకట్టుకుంటుంది.

Deewana OTT : కుర్రాళ్లను కట్టిపడేసిన సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన దీవానా..
Deewana
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2026 | 7:26 AM

Share

కొత్త కొత్త సినిమాలు అటు థియేటర్స్ లోనూ ఇటు ఓటీటీల్లోనూ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లోవిడుదలైన నెలరోజులకు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి నయా మూవీ. ఇక ఇప్పుడు ఓ సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు లేటెస్ట్ సూపర్ హిట్ దీవానా. ప్రేమకథల్లో కొత్తదనం, మంచి ఫీల్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే దర్శకులు తరచూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఓ స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దీవాన. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ చిత్రం దీవానా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్ 19న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. చాలా మంది యూత్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. దీవానా థియేటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

ఆహా గోల్డ్ యూజర్స్ ఈ సినిమాను ఒక్క రోజు ముందుగానే అంటే నిన్ననే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు నార్మల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది దీవానా.. ఈ రోజు (31 నుంచి) అందుబాటులోకి వచ్చేసింది. మారేందుకు ఆలస్యం ఈ సినిమాను ఆహాలో ఫ్యామిలీతో పాటు చేసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ సినిమాలో బాధ్యత లేని యువకుడిగా, ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో హర్షిత్ రెడ్డి తన నటనతో ఆకట్టుకుంటాడు. రెండు షేడ్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. అమూల్య పాత్రలో స్మేహా మణిమేఘలై అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us