తెలుగులో రీమేక్ కానున్న ‘కొరియన్’ సినిమా.. అధికారికంగా ప్రకటించిన పాపులర్ నిర్మాణ సంస్థ.. త్వరలోనే షూటింగ్..

తెలుగులో ఓ పాపులర్ కొరియన్ సినిమా రిమేక్ కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాణ సంస్థ.. ఆ సినిమా ఇండియన్

  • Rajitha Chanti
  • Publish Date - 5:26 pm, Wed, 20 January 21
తెలుగులో రీమేక్ కానున్న 'కొరియన్' సినిమా.. అధికారికంగా ప్రకటించిన పాపులర్ నిర్మాణ సంస్థ.. త్వరలోనే షూటింగ్..

తెలుగులో ఓ పాపులర్ కొరియన్ సినిమా రిమేక్ కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాణ సంస్థ.. ఆ సినిమా ఇండియన్ భాషల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది కూడా.

ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్స్’. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల మందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం తెలుగులో రీమేక్ సినిమాల జోరు పెరిగిపోతుంది. అటు తెలుగు చిత్రాలను పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సంస్థ కొరియన్ భాషకు చెందిన ‘లక్కీ కీ’ అనే సినిమాను అధికారికంగా రీమేక్ చేస్తున్నట్లుగా తెలిపారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్‏టైనర్‏గా ఉండే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లుగా తమ ట్విట్టర్ వేదికగా వెల్లిడించారు. అంతేకాకుండా ప్రముఖ హీరో మరియు డైరెక్టర్‏తో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలియజేశారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Also Read:

కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన నందమూరీ హీరో.. తొలిసారి ట్రిపుల్ రోల్‏లో నటించనున్న కళ్యాణ్ రామ్ ?

Actress Poojahegde: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న పూజాహెగ్డే ?