సమ్మర్లో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలు.. సినీ ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటుందా ? వివరాలు ఇలా ఉన్నాయి..
కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొన్ని రోజుల క్రితం 50 శాతం ఆక్యుపెన్సీతో
కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొన్ని రోజుల క్రితం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో.. సంక్రాంతి కానుకగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు విశేషస్పందన లభించింది. అంతేకాకుండా ఇప్పటికే ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని కూడా కొంతవరకు అధిగమించేలా చేసింది. దీంతో మరికొన్ని సినిమాలు వేసవిలో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉండడంతో.. దర్శక నిర్మాతలు కొంతవరకు ఆందోళన చెందాల్సి వస్తుంది. కారణం ఏంటీ అనుకుంటున్నారా ?
ఇప్పటివరకు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండగా.. సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాలు అన్ని భారీ బడ్జె్ట్వి కాకపోవడంతో కొంతవవరకు నష్టాన్ని పూడ్చుకున్నారు. ఇక సమ్మర్లో చిన్న చిత్రాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల నిర్మాతలకు మాత్రం ఒకింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కించిన.. ఈ 50 శాతం ఆక్యుపెన్సితో ఆ బడ్జెట్ను రాబట్టుకోవడం వారి ముందు ఉన్నా పెద్ద సవాల్. అంతేకాకుండా వేసవిలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ఉండడంతో ఇది మరీ కష్టంగా మారింది. ఇక స్కూల్స్, కాలేజీలకు కూడా వేసవి సెలవులు లేవు. ఇప్పుడిప్పుడే స్కూల్స్ తెరుచుకోవడంతో.. సిలబస్ మిగిలిపోవడంతో పరీక్షలు ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. సంవత్సరం తర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్లకు ప్రేక్షకులు భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఎలాంటి స్పందన రానుందో చూడాలి మరి.
Also Read:
Dhanush : ‘జగమే తంత్రం’ నుంచి నో అప్డేట్.. స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..