అల్లు అర్జున్ డ్యాన్స్‏కి బాలీవుడ్ హీరో ఫిదా.. నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను అంటున్న స్టార్..

అల్లు అర్జున్ డ్యాన్స్‏కి బాలీవుడ్ హీరో ఫిదా.. నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను అంటున్న స్టార్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‏ క్రేజీ పాన్ ఇండియా లెవల్‏లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటు మలయాళ అభిమానులు అల్లు

Rajitha Chanti

|

Jan 20, 2021 | 3:43 PM

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‏ క్రేజీ పాన్ ఇండియా లెవల్‏లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటు మలయాళ అభిమానులు అల్లు అర్జున్‏ను ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. ఇక అల్లు అర్జున్ డాన్స్ కూడా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే మన స్టార్ హీరోకి ఓ బాలీవుడ్ హీరో కూడా అభిమానే అంటా. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా చెప్పుకోచ్చాడు.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలలో టైగర్ ష్రాఫ్ ఒకడు. అయితే ఇతని నటనతోనే కాకుండా ఆయన డాన్స్‏తోనూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాడు. ఇక టైగర్ ష్రాఫ్ డాన్స్ చూస్తే దాదాపు ఆశ్చర్యం కలగకమానదు. కేవలం సినిమాల్లోనే కాకుండా టైగర్ ప్రైవేట్ సాంగ్స్‏లలో కూడా నటిస్తుంటాడు. అంతేకాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‏గా ఉంటాడు టైగర్. ఇటీవల తన ట్విట్టర్ వేదికగా..ఆస్క్ టైగర్ అంటూ అభిమానులతో ముచ్చటించాడు టైగర్. ఇందులో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు టైగర్ ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పుకోచ్చాడు. అయితే ఇందులో ఓ అభిమాని.. మీకు అల్లు అర్జున్‏లో నచ్చే అంశాలు ఏమిటి ? అంటూ అడిగాడు.. దానికి సమాధానమిస్తూ టైగర్.. “చెప్పడం కష్టమే. కానీ నేను అల్లు అర్జున్ మూవ్స్ అండ్ స్టైల్‏కి పెద్ద అభిమానిని. నేను కూడా ఆయనలగా చేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:

Singer Sunitha: వివాహం తర్వాత తొలిసారి పోస్ట్‌ చేసిన సునీత… కాఫీ తాగుతోన్న సమయంలో..

Kgf chapter 2 climax : కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu