Mahesh Babu: మహేష్ బాబు స్టన్నింగ్ లుక్ వెనక ఉంది ఎవరో తెలుసా..? వైరల్‌గా మారిన ప్రిన్స్ స్కిన్ స్పెషలిస్ట్ ఫొటో..
Meet Mahesh Babu Skin Specialist: అమ్మాయిల కలల రాకుమారుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. రోజురోజుకీ వయసు తగ్గుతుందా అన్నంతలా ఉండే అందం మహేష్ బాబు సొంతం. సినిమా సినిమాకీ యంగ్‌గా మారుతూ..
Meet Mahesh Babu Skin Specialist: అమ్మాయిల కలల రాకుమారుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. రోజురోజుకీ వయసు తగ్గుతుందా అన్నంతలా ఉండే అందం మహేష్ బాబు సొంతం. సినిమా సినిమాకీ యంగ్‌గా మారుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాడు మహేష్ బాబు. అయితే ఇన్నేళ్లు అవుతున్నా మహేష్ స్కిన్ టోన్‌లో ఎలాంటి మార్పు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా..? 45 ఏళ్లు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోల కనిపించేందుకు మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. డైట్ నుంచి వర్కవుట్ల వరకు అన్ని సరిగ్గా ఉండేలా చూసుకుంటాడు. అయితే మహేష్ అందానికి వీటితో పాటు ఓ వ్యక్తి కూడా కారణమే విషయం మీకు తెలుసా.? ఆవిడే.. ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రష్మీ శెట్టి. ఈమె మహేష్ బాబు పర్సనల్ స్కిన్ స్పెషలిస్ట్. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ డాక్టర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ప్రపంచానికి పరిచయమైంది. మహేష్ బాబుతో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన రష్మీ శెట్టి.. ‘నా పై నమ్మకం చూపినందుకు, మీరు నాపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.
View this post on Instagram
Also Read: మా వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తాం, ఎవరి సెంటిమెంటునూ గాయపరచాలన్నది మా ఉద్దేశం కాదు, ‘తాండవ్’ యూనిట్