‘మెగాస్టార్‌’కు కొరటాల కండిషన్స్‌..!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో ఓ రేంజ్ ఉంది. ఆయన సినిమా అంటే చెవికోసుకునే అభిమానులు కోకొల్లలు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎదుచూస్తూంటారు. తాజాగా.. చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. అయితే.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో డైరెక్టర్లు ఎదురచూస్తూంటారు. అలాంటి చిరు డేట్స్ ఇస్తేనే చాలని సరిపెట్టుకుంటారు. కానీ దర్శకుడు కొరటాల శివ మాత్రం నా రూటే సెపరేటు అంటున్నాడు. చిరుకే కండీషన్స్ అంటున్నాడు. ఎప్పటినుంచో […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:50 pm, Wed, 19 June 19
'మెగాస్టార్‌'కు కొరటాల కండిషన్స్‌..!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో ఓ రేంజ్ ఉంది. ఆయన సినిమా అంటే చెవికోసుకునే అభిమానులు కోకొల్లలు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎదుచూస్తూంటారు. తాజాగా.. చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. అయితే.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో డైరెక్టర్లు ఎదురచూస్తూంటారు. అలాంటి చిరు డేట్స్ ఇస్తేనే చాలని సరిపెట్టుకుంటారు. కానీ దర్శకుడు కొరటాల శివ మాత్రం నా రూటే సెపరేటు అంటున్నాడు. చిరుకే కండీషన్స్ అంటున్నాడు.

ఎప్పటినుంచో చిరుతో ఓ కమర్షియల్ సినిమా చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ కొరటాల శివ. దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. కమర్షియల్ సినిమా కాబట్టి హీరో ఫిట్‌గా ఉండాలి. కానీ చిరు ఒబెసిటీ కాస్త తగ్గించుకుని, స్టైలిష్‌గా తయారవ్వాలని కొరటాల చెప్పాడట. ఇందుకు చిరూ కూడా ఓకే అన్నారని, డైట్ స్టార్ట్ చేసి, జిమ్‌కి కూడా వెళుతున్నారని సమాచారం. చూడాలి మరి కొరటాల సినిమాలో చిరు ఎలా కనిపిస్తారో..!