ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల చిరంజీవిపై ఫొటోషూట్‌ను నిర్వహించిన కొరటాల, ఓ లుక్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా రైతు సమస్యల ఇతివృత్తాతంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాదు తన పాత చిత్రాలలాగే ఈ మూవీకి కమర్షియల్ హంగులు జోడించారట కొరటాల. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక ఇందులో కథానాయికగా తమన్నా, శ్రుతీహాసన్, నయనతార, అనుష్క ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సైరా నరసింహారెడ్డికి సంగీతం అందిస్తోన్న అమిత్ త్రివేదినే కొరటాల ప్రాజెక్ట్‌కు సంగీతం అందించబోతున్నట్లు టాక్. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.