ఆ బాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు వీరాభిమానట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అటు దక్షిణాది తో పాటు ఇటు ఉత్తరాది లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా హిందీలో డబ్ అయి యుట్యూబ్ లో లక్షల హిట్స్ తెచ్చుకున్నాయి. ఇక అల్లు అర్జున్ నటన ను కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఇష్టపడతారు. అలాంటి కోవలోకి ఇప్పుడు ఒక యంగ్ హీరో వచ్చి చేరాడు. ‘గల్లీ బాయ్’ చిత్రంతో మంచి పేరు […]

  • Updated On - 9:36 pm, Wed, 20 March 19
ఆ బాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు వీరాభిమానట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అటు దక్షిణాది తో పాటు ఇటు ఉత్తరాది లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా హిందీలో డబ్ అయి యుట్యూబ్ లో లక్షల హిట్స్ తెచ్చుకున్నాయి. ఇక అల్లు అర్జున్ నటన ను కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఇష్టపడతారు. అలాంటి కోవలోకి ఇప్పుడు ఒక యంగ్ హీరో వచ్చి చేరాడు.

‘గల్లీ బాయ్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది. ఆయన తాజా ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ మీద తనకున్న అభిమానాన్ని తెలిపారు.

ఆయన మాటల్లోనే..

‘నేను కాలేజీ చదువుతుండగా ‘ఆర్య’ నేను చూసిన మొదటి సినిమా. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది. ఆ తర్వాత నేను ఆయన డాన్స్ వీడియో సాంగ్స్ కొన్ని చూశాను. ఆయన డాన్స్ మూవ్స్ అమోఘంగా ఉంటాయి. ఆయన పర్ఫెక్ట్ స్టైల్ ఐకాన్. ఒక్కసారైనా ఆయనను కలవాలని ఉంది. నేను ఆయన పెద్ద ఫ్యాన్ ని. అని సిద్ధాంత్ తన మనసులో ఉన్న కోరికను తెలియజేశాడు.