‘ఇళయదళపతి ‘విజయ్ సినిమానా..మజాకా!

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌ 63వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.  కాగా ఈ  మూవీ  శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రూ.55 కోట్లతో సన్ టీవీ  తమిళ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్‌ కూడా ప్రకటించకముందే కేవలం ఓ భాషలో హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం రికార్డని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:30 pm, Wed, 20 March 19
'ఇళయదళపతి 'విజయ్ సినిమానా..మజాకా!

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌ 63వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.  కాగా ఈ  మూవీ  శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రూ.55 కోట్లతో సన్ టీవీ  తమిళ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్‌ కూడా ప్రకటించకముందే కేవలం ఓ భాషలో హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం రికార్డని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతుంది. విజయ్‌, నయన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. విజయ్‌, అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన  ‘తెరి’, ‘మెర్సల్‌’  చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్నాయి. మరి ఈ క్రేజీ మూడవ ప్రాజెక్ట్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.