AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆచార్య’ విషయంలో మహేష్‌కి, నాకు మధ్య జరిగిన సంభాషణ ఇదే..!

చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మహేష్‌ను కూడా సంప్రదించారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

'ఆచార్య' విషయంలో మహేష్‌కి, నాకు మధ్య జరిగిన సంభాషణ ఇదే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2020 | 2:44 PM

Share

చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మహేష్‌ను కూడా సంప్రదించారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇక ఈ పుకార్లపై చిరంజీవి స్పందిస్తూ క్లారిటీని ఇచ్చేశారు. కొరటాల స్క్రిప్ట్ చెప్పినప్పుడే.. ఆ పాత్ర కోసం చెర్రీనే సరిపోతాడని తాను, సురేఖ అనుకున్నామని, మహేష్‌ను సంప్రదించలేదని, కానీ ఈ పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో తమకు అర్థం కాలేదని ఆయన అన్నారు. ఇక ఈ పాత్రపై కొరటాల కూడా స్పందించారు.

ఈ పాత్ర కోసం తాము చరణ్‌నే అనుకున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన నిర్ణయానికి చిరంజీవి కూడా ఒప్పుకున్నారని తెలిపారు. అంతేకాదు షెడ్యూల్ కూడా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యే వరకు ‘ఆచార్య’ రాకపోవచ్చంటూ కొని వార్తలు రావడంతో వాటిని చూసి తాను భయపడ్డానని కొరటాల చెప్పారు. ఇక మహేష్‌తో ఉన్న సాన్నిహిత్యం వలన మామూలుగా ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఆచార్య గురించి మాట్లాడుకున్నామని.. ఆ సమయంలో రిలీజ్ డేట్ ఎప్పుడు అని మహేష్ అడగ్గా.. పరిస్థితిని ఆయనకు వివరించినట్లు వెల్లడించారు. దాంతో మహేష్‌.. ”టెన్షన్‌ ఎందుకు నేను ఉన్నాను కదా” అని భరోసా ఇచ్చారని వివరించారు. ఇక మహేష్‌ ఇచ్చిన భరోసా విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పానని.. అది కాస్త పుకారులా మారి ‘ఆచార్య’లో మహేష్ నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయని కొరటాల చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరు గురు, శిష్యుల పాత్రల్లో నటించబోతున్నారు. చరణ్‌కు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు కొరటాల తెలిపారు. కాగా సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్… 4 నెలల అద్దె మినహాయింపు

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?