Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న కొత్త ఫోక్ సాంగ్.. పెళ్లిళ్లు, దావత్ లలో ఇక డీజేలలో దద్దరిల్లిపోవాల్సిందే.. మిలియన్లలో వ్యూస్..
తెలంగాణ ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. లిరిక్స్ అర్థం కాకపోయినా నార్త్ ఇండియా లెవల్లో ఈ జానపద పాటలకు స్టెప్పులేస్తున్నారు. సామాన్యూలే కాదు అటు సెలబ్రెటీస్ సైతం ఇప్పుడు ఈ పల్లె పాటలకు ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక కొత్త ఫోక్ సాంగ్ యూట్యూబ్, ఇన్ స్టాలో దుమ్మురేపుతుంది. ఇంతకీ ఈ పాట ఏంటో తెలుసుకుందామా.

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తెలంగాణ జానపద గేయాలు, ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ప్రైవేట్ ఆల్బమ్ పాటలు కోట్లాది మంది సంగీత ప్రియులను అలరిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వరుసలోనే ఇటీవల విడుదలైన ” సీటి చీర ” (Seeti Cheera) ఫోక్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ప్రారంభం నుంచే శ్రోతలను ఆకట్టుకునేలా మాస్ బీట్స్, రసవత్తరమైన గ్రామీణ నేపథ్యంతో రూపొందించబడింది. సింగర్స్ నర్సింహులు, నాగవ్వ తమ జానపద శైలి గొంతుతో పాడిన ఈ పాట వినేవారిని ఇట్టే కట్టిపడేస్తోంది. ముఖ్యంగా పాటలోని మాస్ బీట్స్, సంగీత దర్శకుడు రవి కళ్యాణ్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్ రాబోయే పండుగలు, పెళ్లిళ్లు, పబ్‌లలో డీజేల మోత మోగించేలా రూపుదిద్దుకున్నాయి .
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..
ఈ సాంగ్ వీడియోలో మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి తమ అద్భుతమైన నటన, కిరాక్ స్టెప్పులతో రచ్చ చేశారు.. కలర్‌ఫుల్ విజువల్స్, కొరియోగ్రఫీ పాట రేంజ్‌ను మరింత పెంచాయి. శ్రీకాంత్ దర్శకత్వం, కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ పాట గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలాది లైక్‌లు సాధిస్తూ యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఫోక్ లవర్స్, యూత్ ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తూ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో డీజే ఈవెంట్స్ మరియు పండుగల వేడుకల్లో ” సీటి చీర ” పాట దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
సీటి చీర ఫోక్ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..
