Sathyaraj: రాజకీయాల్లో సత్యరాజ్ కూతురు సంచలనం.. హీరోయిన్లను మించిన అందం.. అయినా..
తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యరాజ్. కెరీర్ తొలినాళ్లల్లో హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ సత్యరాజ్ కూతురు రాజకీయాల్లో కొనసాగుతున్నారని మీకు తెలుసా.. ?

దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. హీరోగా అనేక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు సత్యరాజ్. పగలే వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం హీరోలకు తండ్రిగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి 1,2 సినిమాలతో సత్యరాజ్ క్రేజ్ పీక్స్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సత్యరాజ్ తనయుడు సైతం తమిళంలో హీరోగా రాణిస్తున్నాడు. కానీ కూతురు మాత్రం రాజకీయాల్లో సత్తా చాటుతుంది.
సత్యరాజ్ కూతురు పేరు దివ్య సత్యరాజ్. అందరిలాగే తండ్రి బాటలో సినిమాల్లోకి కాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దివ్య సత్యరాజ్ ప్రముఖ న్యూట్రిషియన్. సినిమాలు, యాక్టింగ్ పె పెద్దగా ఆసక్తి లేకపోవడంతో మీడియాకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. హెల్త్, లైఫ్ స్టైల్ కు సంబంధించిన నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఇన్నాళ్లు న్యూట్రిషియన్ అయిన దివ్య సత్యరాజ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు.
తమిళనాడులోని అధికార పార్టీలో చేరారు దివ్య సత్యరాజ్. చెన్నైలోని పార్టీ కార్యాలయం అన్నా అరివలయంలో పార్టీలో చేరారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా బయోగ్రఫీలో స్టేట్ డిప్యూటీ సెక్రటరీ అనే మార్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న దివ్య.. ఇటు నెటిజన్స్, అభిమానులకు అవసరమైన హెల్త్ సలహాలు సైతం ఇస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..