Meher Ramesh: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన డైరెక్టర్ మెహర్ రమేష్ తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన తెరకెక్కించిన కంత్రీ, బిల్లా సినిమాలు టేకింగ్ పరంగా ప్రశంసలు పొందాయి. కానీ షాడో, శక్తి, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ను అలరించలేకపోయాయి.

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే గురువారం (మార్చి 27) పరిస్థితి విషమించడంతో సత్యవతి తుది శ్వాస విడిచారు. దీంతో మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా సత్యవతి మరణ వార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు. దర్శకులు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేది. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. రమేష్, సత్యవతి కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ సంతాపం..
దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇవి కూడా చదవండి– @PawanKalyan pic.twitter.com/QjShqIyp6z
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2025
మెహర్ రమేష్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగాడు . అతని తండ్రి నగరంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. రమేష్ మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. ఇక దర్శకుడు కావడానికి ముందు మెహర్ రమేష్ బాబీ సినిమాలో ఓ సహాయక పాత్రను పోషించాడు. ఆ తర్వాత కన్నడ చిత్రం వీర కన్నడిగ (2004) తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మెహర్. ఇది తెలుగులో ఆంధ్రావాలా (2004)గా రిలీజైంది. అతని రెండవ చిత్రం అజయ్ (2006). ఇది మహేష్ ఒక్కడుకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యయి. కానీ తెలుగులో మాత్రం మెహర్ కు సరైన విజయం దక్కలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








