Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

l2 Empuraan Movie Review: ఎల్ 2: ఎంపురాన్ మూవీ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే..

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. ఐదేళ్ళ కింద విడుదలైన ఈ చిత్రం మలయాళంలో మొదటి సారిగా 150 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చిందిప్పుడు. మరి ఎంపురాన్ సినిమా ఎలా ఉంది..? మరోసారి మెప్పించిందా లేదా చూద్దాం..

l2 Empuraan Movie Review: ఎల్ 2: ఎంపురాన్ మూవీ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే..
L2 Empuraan
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 27, 2025 | 4:01 PM

నటులు: మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, సాయి కుమార్, అభిమన్యు సింగ్, ఇంద్రజీత్ సుకుమారన్ తదితరులు

ఎడిటర్: అఖిలేష్ మోహన్

సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్

సంగీతం: దీపక్ దేవ్

కథ, స్క్రీన్ ప్లే: మురళీ గోపీ

దర్శకుడు: పృథ్వీరాజ్ సుకుమారన్

నిర్మాతలు: సుభాస్కరన్, గోకులం గోపాలన్, ఆంటోనీ పెరుంబవూర్

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. ఐదేళ్ళ కింద విడుదలైన ఈ చిత్రం మలయాళంలో మొదటి సారిగా 150 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చిందిప్పుడు. మరి ఎంపురాన్ సినిమా ఎలా ఉంది..? మరోసారి మెప్పించిందా లేదా చూద్దాం..

కథ:

పీకేఆర్ సృష్టించిన సామ్రాజ్యాన్ని సెట్ చేసి వారసులకు ఇచ్చేసి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు అబ్రహాం ఖురేషీ (మోహన్ లాల్). ఆయన వెళ్లిపోయిన తర్వాత మళ్లీ కేరళలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. దానికితోడు సీఎం జతిన్ రాందాస్ (టొవినో థామస్) తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఇవన్నీ చూస్తూ కూడా ఏం చేయలేకపోతుంది ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్). ఇలాంటి సమయంలో ఇక్కడ జరిగేదంతా ఎలాగైనా ఖురేషీకి చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు గోవర్ధన్ (ఇంద్రజీత్ సుకుమారన్). కానీ అవన్నీ ముందే తెలుసుకుంటాడు ఖురేషీ. మరోవైపు అబ్రహం కోసం ప్రపంచంలోని చాలా దేశాలు వెంటాడుతూ ఉంటాయి. దాంతో తనకోసం ఎవరూ వెతకకుండా ఓ ప్లాన్ చేసి.. కేరళకు వస్తాడు ఖురేషీ. తనను నమ్మిన వాళ్ల కోసం ఏం చేసాడు..? పార్టీని మళ్లీ గాడిన పెట్టాడా లేదా..? అసలు సయ్యద్ (పృథ్వీరాజ్ సుకుమారన్)తో ఖురేషీకి ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:

సీక్వెల్ ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. బ్రాండ్ సరిగ్గా వాడుకుంటే ఓకే గానీ.. లేదంటే అంతే సంగతులు. లూసీఫర్ 2 కూడా అంతే.. పూర్తిగా బ్రాండ్‌ను నమ్ముకుని వచ్చిన సినిమా. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైప్ మైండ్‌లో పెట్టుకుంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అందులో స్టోరీ టెల్లింగ్ అనేది మామూలుగా ఉండదు. ప్రతీ సీన్ చాలా అద్భుతంగా డిజైన్ చేసాడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ ఇందులో అలా కాదు.. ఏ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే అనిపిస్తుంది.. అలాగే మోహన్ లాల్ ర్యాంపేజ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. లూసీఫర్ పూర్తిగా మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.. స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్.. సెకండ్ పార్ట్ అలా కాదు.. మొత్తం ఎలివేషన్స్ మీదే వెళ్లిపోతుంది. మొదటి అరగంట అద్భుతంగా మొదలైంది.. కానీ ఆ తర్వాత నెమ్మదిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత గానీ మోహన్ లాల్ ఎంట్రీ ఉండదు. స్క్రీన్ మీద హీరో లేకపోయినా.. ఆయన ప్రజెన్స్ కనిపిస్తూనే ఉంటుంది.. లూసీఫర్ అంతా పొలిటికల్ డ్రామా. ఇందులో పాలిటిక్స్ తక్కువ.. ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. కథ కూడా చాలా మలుపులు తీసుకుంటుంది.. అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి కానీ అవి సరిపోలేదు.. కీలకమైన సెకండాఫ్ కూడా మనం ఊహించిన దానికంటే తక్కువగానే అనిపిస్తుంది. ఈసారి పాలిటిక్స్ కంటే రివేంజ్ డ్రామాపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్‌లో హైలైట్‌గా నిలిచిన సన్నివేశాలు పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతీసారి వచ్చి ఖురేషీ అడ్డంగా నిలబడుతుంటాడు.. తన చెల్లిని కాపాడుతుంటాడు.. అందులో ఓ ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది అంతగా వర్కవుట్ కాలేదు. పైగా మంజు వారియర్, టొవినో మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకోవచ్చు కానీ ఎందుకో మరి చాలా సాదా సీదాగా వాటిని తీసేసాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చాలా వరకు ఖర్చు కనిపించింది కానీ ఎమోషనల్ కనెక్ట్ కనిపించలేదు. బ్రాండ్ కోసం వెళ్తే ఎంపురాన్ ఎంజాయ్ చేస్తారు కానీ మునపటి పార్ట్ గుర్తుంటే మాత్రం అస్సలు ఎక్కదు ఈ సినిమా.

నటీనటులు:

మోహన్ లాల్ మరోసారి అదరగొట్టాడు.. అబ్రహాం ఖురేషీగా స్క్రీన్‌ను షేక్ చేసాడు. సినిమా మొదలైన గంట తర్వాత హీరో వచ్చినా ఆ ఫీలింగ్ అనిపించదు. పృథ్వీరాజ్ కనిపించేది కాసేపే అయినా బాగున్నాడు.. టొవినో థామస్ ఓ కీలక పాత్రలో మెప్పించాడు. మంజు వారియర్ మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మాయ చేసింది. సినిమాలో ఇంకా చాలా మంది నటులున్నారు. కాకపోతే అంతా మలయాళ నటులే కావడంతో మనకు అంతగా పరిచయం ఉండదు. ఉన్నంతలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తమ్ముడు ఇంద్రజీత్ బాగా నటించాడు. జర్నలిస్ట్ పాత్ర చాలా బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

దీపక్ దేవ్ సంగీతం అదిరిపోయింది. ఆర్ఆర్ కూడా చాలా బాగా వర్కవుట్ అయింది. ఎడిటింగ్ చాలా స్లో.. కొన్ని సీన్స్ చాలా సాగదీసారు. సెకండాఫ్ కూడా కొన్ని సీన్స్ సినిమాలో లేకపోయినా నష్టం అనిపించదు. కాకపోతే ఎలివేషన్స్ కోసమే చాలా సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఈసారి దర్శకుడిగా అంతగా మెప్పించలేదు. పొలిటికల్ డ్రామా చూద్దామని వెళ్లిన ఆడియన్స్‌కు రివేంజ్ డ్రామా చూపించారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా లూసీఫర్ 2 ఎంపురాన్.. అంచనాలు లేకుండా వెళ్తే జస్ట్ ఓకే..!