ఇటు ‘ఆర్ఆర్ఆర్’.. అటు ‘కేజీఎఫ్ 2’.. తప్పని తిప్పలు..!

చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాను తెరకెక్కించేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా కొన్ని వందల మంది కష్టపడుతుంటారు. ఎంతో ప్రణాళిక వేసుకొని ఓ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తుంటారు. అయితే సామాజిక మాధ్యమం హవా రోజు రోజుకు పెరుగుతోన్న ఈ కాలంలో చాలా సినిమాలు లీకురాయుళ్ల బారిన పడుతున్నాయి. షూటింగ్ చేస్తున్న సమయంలోనూ, సినిమా రిలీజ్ అయిన తరువాత.. పలు సినిమాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో విధంగా లీకు రాయుళ్లు […]

ఇటు 'ఆర్ఆర్ఆర్'.. అటు 'కేజీఎఫ్ 2'.. తప్పని తిప్పలు..!

చిన్నదైనా, పెద్దదైనా ఒక సినిమాను తెరకెక్కించేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా కొన్ని వందల మంది కష్టపడుతుంటారు. ఎంతో ప్రణాళిక వేసుకొని ఓ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తుంటారు. అయితే సామాజిక మాధ్యమం హవా రోజు రోజుకు పెరుగుతోన్న ఈ కాలంలో చాలా సినిమాలు లీకురాయుళ్ల బారిన పడుతున్నాయి. షూటింగ్ చేస్తున్న సమయంలోనూ, సినిమా రిలీజ్ అయిన తరువాత.. పలు సినిమాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో విధంగా లీకు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ మధ్య లీక్ గోలలు ఎక్కువయ్యాయి.

తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే పలు లుక్‌లు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా యశ్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2 ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలోని కీలక సీన్లు కావడం విశేషం. అయితే ఈ వీడియోల వలన ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నప్పటికీ.. ముందే లీక్ అవ్వడంపై మూవీ యూనిట్ నిరాశను వ్యక్తపరుస్తోంది. దీంతో ఇటు ఆర్ఆర్ఆర్, అటు కేజీఎఫ్ 2 రెండు టీమ్‌లు మరింత పడగ్బందీగా షూటింగ్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రెండు సినిమాలపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu