థ్రిల్లర్‌ మూవీ సీక్వెల్‌లో.. శ్రీదేవీ పాత్రలో కీర్తి!

కమల్ హాసన్‌, శ్రీదేవీ జంటగా నటించిన హిట్ చిత్రాల్లో ఎర్ర గులాబీలు(తమిళ్‌లో సిగప్పు రోజక్కల్‌) ఒకటి. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది.

థ్రిల్లర్‌ మూవీ సీక్వెల్‌లో.. శ్రీదేవీ పాత్రలో కీర్తి!

Keerthy in Erra Gulabilu sequel: కమల్ హాసన్‌, శ్రీదేవీ జంటగా నటించిన హిట్ చిత్రాల్లో ఎర్ర గులాబీలు(తమిళ్‌లో సిగప్పు రోజక్కల్‌) ఒకటి. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎర్ర గులాబీలను తెరకెక్కించిన భారతీ రాజా తనయుడు మనోజ్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో ఇప్పటికే కథను రెడీ చేయడం, కీర్తికి చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? కమల్‌ చేసిన పాత్రలో ఆయనే నటిస్తారా..? లేక మరో యంగ్ హీరో నటిస్తారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా కీర్తి సురేష్‌ నటించిన మిస్ ఇండియా, మరక్కర్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం ఈ నటి గుడ్‌ లక్ సఖి, అన్నాత్తే, రంగ్ దే చిత్రాల్లో కనిపించనుంది. వీటితో పాటు మహేష్‌ సరసన సర్కారు వారి పాటలో కీర్తి నటించనుంది.

Read This Story Also: ఈసారి ‘మెగా’ మామా అల్లుళ్ల మల్టీస్టారర్‌.. కథ రెడీ!

Click on your DTH Provider to Add TV9 Telugu