Nithin Gopi: గుండెపోటుతో యువ నటుడు కన్నుమూత.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

ఇటీవల కాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య బాగా పెరిగింది. చాలామంది చిన్న వయసులోనే హార్ట్‌ స్ట్రోక్‌ బారిన పడి కన్నుమూస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా గుండె పోటుతో చనిపోతున్నారు. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మొదలు ఫిబ్రవరిలో కన్నుమూసిన తారకరత్న వరకు గుండెపోటు బాధితులే. ఇప్పుడు మరో యువ నటుడు గుండెపోటుతో కుప్ప కూలారు.

Nithin Gopi: గుండెపోటుతో యువ నటుడు కన్నుమూత.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ
Nithin Gopi
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2023 | 1:00 PM

ఇటీవల కాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య బాగా పెరిగింది. చాలామంది చిన్న వయసులోనే హార్ట్‌ స్ట్రోక్‌ బారిన పడి కన్నుమూస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా గుండె పోటుతో చనిపోతున్నారు. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మొదలు ఫిబ్రవరిలో కన్నుమూసిన తారకరత్న వరకు గుండెపోటు బాధితులే. ఇప్పుడు మరో యువ నటుడు గుండెపోటుతో కుప్ప కూలారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్‌ గోపీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అతని వయసు కేవలం 30 సంవత్సరాలే కావడం గమనార్హం. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్‌ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్‌ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ అనే సినిమాలో నటించాడు. ఇందులో విష్ణు వర్ధన్‌ కుమారుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో కూడా నితిన్‌ నటించారు. భక్తి సీరియల్‌ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కూడా కనిపించారు. కన్నడ, తమిళ్‌ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు.

కాగా ప్రముఖ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించాడు నితిన్‌. ఇటీవల ‘ధృవ నక్షత్రం’ సీరియల్‌కి దర్శకత్వం వహించారుకూడా. మరో కొత్త సీరియల్‌ను తెరకెక్కించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్‌ తుది శ్వాస విడిచారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమాన్లు నితిన్‌ ఫ్యామిలీకి సంతాపం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..