థ్రిల్లర్‌గా ‘118’.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్

థ్రిల్లర్‌గా ‘118’.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్

కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘118’. నివేథా థామస్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలంటే మార్చి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 15, 2019 | 6:04 PM

కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘118’. నివేథా థామస్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలంటే మార్చి 1 వరకు ఆగాల్సిందే. కాగా పటాస్ తరువాత ఆరేంజ్ హిట్ లేని కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu