AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడరన్ సీత.. జనాలకు భలే నచ్చిందే.!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్, టీజర్ మొదటి నుంచి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సీత పేరు పెట్టి హీరోయిన్ ప్రవర్తనను పొగరుగా చూపించడం.. రాముడి పేరుతో హీరోను ముద్దపప్పులా చూపించడం.. వీరికి తోడు రావణాసురుడికి ప్రతిరూపంగా సోనూ సూద్.. అన్ని కలిసి ప్రేక్షకులకు సీతను కనెక్ట్ చేశాయి. అందుకే ఈ సినిమా ప్రోమోలకు సోషల్ మీడియాలో భలే రెస్పాన్స్ వస్తోంది. […]

మోడరన్ సీత.. జనాలకు భలే నచ్చిందే.!
Ravi Kiran
|

Updated on: May 12, 2019 | 6:03 PM

Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్, టీజర్ మొదటి నుంచి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సీత పేరు పెట్టి హీరోయిన్ ప్రవర్తనను పొగరుగా చూపించడం.. రాముడి పేరుతో హీరోను ముద్దపప్పులా చూపించడం.. వీరికి తోడు రావణాసురుడికి ప్రతిరూపంగా సోనూ సూద్.. అన్ని కలిసి ప్రేక్షకులకు సీతను కనెక్ట్ చేశాయి. అందుకే ఈ సినిమా ప్రోమోలకు సోషల్ మీడియాలో భలే రెస్పాన్స్ వస్తోంది.

ఇది ఇలా ఉంటే ‘సీత’ ట్రైలర్ మే 9న రిలీజైన సంగతి తెలిసిందే. మొదట్లో రిలీజైన ప్రోమోస్‌ను మించి ఈ ట్రైలర్ వెరైటీగా ఉండడంతో సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ ట్రైలర్‌కు ఎకే ఎంటర్టైన్మెంట్స్ వారి అఫీషియల్ ఛానెల్‌లోనే 2. 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా ట్రెండింగ్ అవుతోంది.

మరోవైపు వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది కొంచెం ఊరటను ఇచ్చే అంశమే. మరి ఈ సీత చేతిలో మన బెల్లం బాబు రాత ఎలా ఉందో తెలియాలంటే మే 24 వరకు ఆగాల్సిందే.

Follow Us