AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచు విష్ణు వల్ల నా ప్రాణాలకు ముప్పు – ఓటర్ డైరెక్టర్

మంచు విష్ణు హీరోగా జి.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఓటర్’ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా వివాదం వల్ల వాయిదా పడింది. హీరో విష్ణుకి.. దర్శకుడు కార్తీక్‌కి మధ్య విభేదాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వివాదం ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే దర్శకుడు ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియో ఫిల్మ్‌నగర్‌లో సంచలనం అవుతోంది. ఓటర్ సినిమా కోసం అసెంబ్లీ రౌడీ కథ.. స్క్రీన్ […]

మంచు విష్ణు వల్ల నా ప్రాణాలకు ముప్పు - ఓటర్ డైరెక్టర్
Ravi Kiran
|

Updated on: May 12, 2019 | 4:58 PM

Share

మంచు విష్ణు హీరోగా జి.ఎస్.కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఓటర్’ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా వివాదం వల్ల వాయిదా పడింది. హీరో విష్ణుకి.. దర్శకుడు కార్తీక్‌కి మధ్య విభేదాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వివాదం ఇప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే దర్శకుడు ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియో ఫిల్మ్‌నగర్‌లో సంచలనం అవుతోంది. ఓటర్ సినిమా కోసం అసెంబ్లీ రౌడీ కథ.. స్క్రీన్ ప్లే రాసినందుకు కోటిన్నర ఇస్తానని ఒప్పుకున్నట్లు మంచు విష్ణు ఆరోపిస్తున్న దానిలో వాస్తవం లేదని.. ఓటర్ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే .. డైరెక్షన్ చేస్తే నాకు వచ్చేది కేవలం 20 లక్షలు మాత్రమే అని ఆ వీడియోలో దర్శకుడు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఎంత మోసం.? నాకు రెమ్యునరేషన్ వచ్చేదే 20 లక్షలు. అలాంటి నేను కోటిన్నర పెట్టి ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా రైట్స్ కొన్ని ఎలా తీస్తాను.? ఎంత మోసం ఇది? ఒక హీరో చేసే పనేనా? కాదు.. నన్ను మోసం చేశావని పొరపాటున అతనికి నేను రివర్సయ్యాను కాబట్టి అతడు నన్ను ఏమైనా చేయొచ్చు. నన్ను ఏం చేసినా .. నేను కనిపించకుండా పోయినా .. దానికి మంచు విష్ణునే కారణం. ఇది ఒక హీరో చేసే పనే కాదు. ఒక దర్శకుడిగా నిర్మాతకు నష్టం కలగకూడదని భావించి సినిమా రిలీజవ్వాలని కోరుకుని ఈ చిత్రానికి సైన్ చేశాను. అసలు ఓటర్‌కి అసెంబ్లీ రౌడీకి సంబంధమే లేదు. అయినా ఎందుకు సైన్ చేశానంటే.. నేను ఇంత త్యాగం చేస్తున్నాను కాబట్టి సినిమాని ఎమోషనల్‌గా భావించి రిలీజ్ చేస్తారని ఫీలయ్యాను. కానీ నన్నే మోసం చేసి నాపైనే కేసు పెట్టి ప్రొడ్యూసర్లను టార్చర్ పెడుతున్నారంటే ఇది ఒక హీరో చేయాల్సిన పనేనా? డబ్బులకు కక్కుర్తి పడి సినిమాని ఆపుకున్న హీరో ప్రపంచంలో ఒక్క మంచు విష్ణునే అవుతాడు. ఆయన వల్ల నా ప్రాణాలకు డేంజర్’ ఉందంటూ  వీడియోలో దర్శకుడు జి.ఎస్.కార్తీక్ రెడ్డి తన భయాన్ని వ్యక్తం చేశాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు నన్ను టార్చర్ చేస్తున్నాడని.. నాపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. అసెంబ్లీ రౌడీకి ఓటర్‌కి సంబంధమే లేదని దర్శకుడు కార్తీక్ రెడ్డి మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఉండగా ఎందుకిలా గొడవని పెద్ద చేస్తున్నారంటూ వీరిద్దరిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. రోజురోజుకి ముదురుతున్న ఈ వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారో చూడాలి.

Follow Us