AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్‌పై శ్రీకృష్ణార్జున విజయం, బృందావనం వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయన అందిస్తూ వచ్చారు. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు […]

ప్రముఖ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 12, 2019 | 4:15 PM

Share

ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్‌పై శ్రీకృష్ణార్జున విజయం, బృందావనం వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయన అందిస్తూ వచ్చారు. సోమవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us