‘జాతి రత్నాలు’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. సమ్మర్‏లో అలరించనున్న కామెడీ ఎంటర్‏టైనర్..

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ హీరో నవీన్ పాలిషెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జాతిరత్నాలు'. ఈ మూవీలో

  • Rajitha Chanti
  • Publish Date - 9:54 am, Mon, 25 January 21
'జాతి రత్నాలు' మూవీ రిలీజ్ డేట్ లాక్.. సమ్మర్‏లో అలరించనున్న కామెడీ ఎంటర్‏టైనర్..

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ హీరో నవీన్ పాలిషెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ మూవీలో టాలీవుడ్ కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

సమ్మర్‏లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వాటి జాబితాలోకి ‘జాతిరత్నాలు’ చిత్రం కూడా వచ్చింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం. రండి నవ్వుకుందాం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొత్తానికి వేసవిలో అలరించేందుకు రాబోతోంది ‘జాతిరత్నాలు’.

Also Read:

Avika Gor : మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఆ హీరో ఎవరంటే..