AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Death Anniversary: నటి శ్రీదేవి వర్ధంతి.. సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్టు చేసిన కూతుళ్లు జాన్వీ, ఖుషీ..

Sridevi Death Anniversary: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు..

Sridevi Death Anniversary: నటి శ్రీదేవి వర్ధంతి.. సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్టు చేసిన కూతుళ్లు జాన్వీ, ఖుషీ..
Shiva Prajapati
|

Updated on: Feb 24, 2021 | 8:11 PM

Share

Sridevi Death Anniversary: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అలనాటి అందాల తార శ్రీదేవి. బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన శ్రీదేవి.. చనిపోయి నేటికి మూడేళ్లు అవుతోంది. శ్రీదేవి మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సోషల్ మీడియాలో ఉద్విగే భరిత పోస్టులు చేశారు.

ఫిబ్రవరి 24, 2018న దుబాయ్ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో విద్యుదఘాతానికి గురైన శ్రీదేవి 54 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం కుటుంబం, స్నేహితులతో పాటు కోట్లాది మంది అభిమాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇదిలాఉంటే.. తన తల్లి శ్రీదేవి జ్ఞాపకాలను తలచుకున్న జాన్వి కపూర్.. గతంలో శ్రీదేవి స్వహస్తాలతో రాసిన నోట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. “ఐ లవ్ యు మై లబ్బూ మీరు ప్రపంచంలోనే ఉత్తమ కూతుళ్లు.” శ్రీదేవి ఆ నోట్‌పై రాశారు. ఆ నోట్‌ను పోస్ట్ చేసిన జాన్వీ.. ‘‘మిస్‌ యూ,’’ ‘ధడక్’ అని క్యాప్షన్ పెట్టింది. ఇక జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రమ్‌లో తల్లి శ్రీదేవి స్మృతులను షేర్ చేసింది. బోనీ కపూర్, శ్రీదేవి కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటోను ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శ్రీదేవి అందమైన చిరునవ్వులు చిందిస్తూ ఉంది. అయితే, ‘ఐ లవ్ యూ అమ్మా’ అంటూ ఖుషీ క్యాప్షన్ పెట్టింది.

Janhvi Kapoor Post:

ఆగస్టు 13, 1963 లో తమిళనాడులోని శివకాశీలో అయ్యప్పన్, రాజేశ్వరి దంపతులకు శ్రీదేవి జన్మించింది. శ్రీదేవి అసలు పేరు.. శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్రీదేవి.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి భారత సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి చివరి చిత్ర ‘మామ్’. ఈ సినిమాకు శ్రీదేవి మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది.

Khushi Kapoor Post:

Also read:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

చిరుతో చిందేయనున్న చెన్నై బ్యూటీ.. దాదాపు 15ఏళ్ల తర్వాత మెగాస్టార్ సినిమాలో ఆ హీరోయిన్..