AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt : అలియా పై దర్శకధీరుడు ఫైర్.. డేట్స్ ఇవ్వడం లేదంటూ అలక.. జక్కన క్లారిటీ

దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ఎన్నో పుకార్లు షికారు చేసాయి. వాటిలో  ఒకటి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి. సుశాంత్ సింగ్ మరణంతర్వాత అలియా పై నెటిజన్లు కోపం పెంచుకున్న విషయం తెలిసిందే.

Alia Bhatt : అలియా పై దర్శకధీరుడు ఫైర్.. డేట్స్ ఇవ్వడం లేదంటూ అలక.. జక్కన క్లారిటీ
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 8:51 PM

Share

Alia Bhatt : దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఎన్నో పుకార్లు షికారు చేసాయి. వాటిలో  ఒకటి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి. సుశాంత్ సింగ్ మరణంతర్వాత అలియా పై నెటిజన్లు కోపం పెంచుకున్న విషయం తెలిసిందే. నేపాటిజం అంటూ నెటిజన్లంతా ఈ అమ్మడి పై ఫైర్ అయ్యారు. అప్పటికే అలియా ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఒప్పుకుంది. అయితే ఆసమయంలో రాజమౌళి అలియాను తప్పించాలనుకుంటున్నాడని వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని జక్కన తిప్పికొట్టారు.

ఆతర్వాత అలియా వల్ల ఆర్ఆర్ఆర్ షూట్ లేటవుతుందని దాంతో అమ్మడి ‌పై రాజమైళి కొంచెం గుస్సా అయ్యడని, నావల్ల కాదు ఈవెయిటింగ్ అంటూ.. అలియా క్యారెక్టర్‌కి కత్తెరేశాడని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడా గాలి కబుర్లకు గాలి తీసేశాడు.. జక్కన్న! అవును అవన్నీ అర్థం పర్థం లేని మాటలని చెప్పకనే చెప్పేశాడు. రీసెంట్‌గా ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారట. అలియా మొదట డేట్లు సర్థుబాటు చేయలేక కొంచెం ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమేనట.

కాని జక్కన పాన్‌ ఇండియా సినిమా.. అందులోనూ రామ్‌ చరణ్ హీరోకావడంతో సినిమాని వదులుకోలేక తన డేట్లను రీషెడ్యూల్ చేసుకుని మరీ. జక్కన్న సినిమాకు సెట్ చేసిందట. అంతేకాదు.. చిత్రీకరణలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో ఆమె హైదరాబాద్‌కు రానుందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో కలిసి ఆమె రెండు పాటలకు షూటింగ్‌లో పాల్గొననుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ఇక ఈ సినిమాలో చరణ్‌ అల్లురి సీతారామరాజుగా కనిపించనుండగా.. అలియా సీత పాత్రలో అలరించనుంది. మరోవైపు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కనిపించనున్నాడు. తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్‌ సందడి చేయనుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. అజయ్‌దేవగణ్‌, సముద్రఖని, అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Sunil : మరో సినిమాను అనౌన్స్ చేసిన సునీల్.. ఈ సారి భయపెట్టనున్న కమెడియన్ కం విలన్