AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : 4 ఏళ్లు ఆలీ దగ్గర డ్రైవర్‏గా పనిచేసి.. కట్ చేస్తే.. జబర్దస్త్ షోలో తోపు కమెడియన్.. ఎవరంటే..

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నటీనటులు ఈ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ తన సినీ ప్రస్థానాన్ని పంచుకున్నారు. ఆలీ అన్నయ్య దగ్గర నాలుగేళ్లు కార్ డ్రైవర్‌గా పనిచేసిన రోజులు, ఆ తర్వాత నటుడిగా మారిన వైనం వివరించారు. రాజశేఖర్ వీరాభిమానిగా హైదరాబాద్ వచ్చి, కష్టాలు ఎదుర్కొని, సహనంతో సినీ రంగంలో ఎలా నిలదొక్కుకున్నారో తెలిపారు.

Jabardasth : 4 ఏళ్లు ఆలీ దగ్గర డ్రైవర్‏గా పనిచేసి.. కట్ చేస్తే.. జబర్దస్త్ షోలో తోపు కమెడియన్.. ఎవరంటే..
Ali
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2026 | 6:01 PM

Share

జబర్దస్త్ కమెడియన్ తడివేలు తన సినీ రంగ ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులను, అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తడివేలు మొదట్లో ప్రభాకర్ రెడ్డి గారి టిన్సి క్లబ్‌లో బాయ్‌గా పనిచేశారు. ఇది జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ గారి ఇంటి పక్కనే ఉండేది. అక్కడ పనిచేసే సమయంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆలీ అన్నయ్య దగ్గర డ్రైవర్‌గా చేరాలనే కోరికతో ఆయనను సంప్రదించానని తెలిపారు. ఆలీ అన్నయ్య కారు కొనగానే, “నన్నే డ్రైవర్‌గా పెట్టుకోవాలి” అని అడిగానని, అనుకున్నట్టే ఆలీ కారు కొన్నప్పుడు తనను పిలిపించారని తడివేలు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన పేరు “ఇజ్రాయిల్” అని ఉండేదని, ఆ పేరుతోనే ఆలీ అన్నయ్య డ్రైవర్‌గా తనను నియమించారని తెలిపారు. ఆలీ దగ్గర నాలుగేళ్ల పాటు కార్ డ్రైవర్‌గా నిజాయితీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తూనే నటుడిగా ఎదగాలనే తపన తడివేలులో బలంగా ఉండేది. డ్రైవింగ్ మానేసి డాన్సర్‌గా కార్డు తీసుకున్నారు. డాన్స్ ఆడుకుంటూనే, తన ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్స్‌తో దర్శకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తన స్నేహితుడు స్వామి (మంగళ షాపు యజమాని) సహాయంతో విభిన్నమైన మోడల్స్ సృష్టించి, తద్వారా దర్శకులకు సులువుగా పరిచయం అయ్యారు. ఇప్పటివరకు దాదాపు 120 సినిమాల్లో నటించానని, పలువురు దర్శకుల దగ్గర మళ్లీ మళ్లీ అవకాశాలు పొందానని తడివేలు గర్వంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

తన సినీ ప్రస్థానంలో సహనం ఎంత ముఖ్యమో తడివేలు వివరించారు. కొత్త తరం నటులు, దర్శకులు వస్తున్న ఈ సమయంలో, పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాదని, సహనం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. “సినిమా అంటే ప్రేమ ఉండాలి, కానీ పిచ్చి ఉండకూడదు. పిచ్చి ఉంటే అది కుటుంబానికి, వ్యక్తిగత లక్ష్యాలకు ఆటంకం అవుతుంది” అని ఆయన అన్నారు. సినిమా రంగం ఒక సముద్రం లాంటిదని, ఇందులో ఎత్తుపల్లాలు సహజమని, సహనంతో ఎదురుచూస్తే విజయం వరిస్తుందని ఆయన దృఢంగా నమ్మారు. తన కెరీర్ కోసం ఒకప్పుడు మందు, సిగరెట్లు కూడా మానేశానని, తన వయసు 52 సంవత్సరాలు అయినా ఇంకా యంగ్‌గా కనిపిస్తానని, తన సహజమైన సాల్ట్ పెప్పర్ హెయిర్‌స్టైల్ కూడా తనకు ప్రత్యేకమైన పాత్రలు తెచ్చిపెట్టిందని వివరించారు. ధనుష్ హీరోగా వచ్చిన ఒక సినిమాలో సముద్రకని గారికి డ్రైవర్ పాత్రను ఈ గెటప్‌తోనే పొందానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

తన జీవితంలో కష్టాలను తడివేలు ఏ మాత్రం దాచుకోలేదు. ఒకప్పుడు జేబులో 20 రూపాయలు కూడా లేని రోజులు, వెయ్యి రూపాయలు అప్పు పుట్టకపోయినా బన్ను తిని బతికిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. లారీ క్లీనర్‌గా పనిచేసి, సొంతంగా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ అయ్యానని, తన భార్యాపిల్లలను పోషించడానికి డ్రైవింగ్ ఒక ఆధారంగా నిలిచిందని చెప్పారు. తడివేలుకు చిన్నప్పటి నుంచీ నటుడు రాజశేఖర్ అంటే వీరాభిమానం. రాజశేఖర్ గారి వీరాభిమాని అవ్వడం వల్లే హైదరాబాద్‌కు వచ్చానని, అయితే ఇంతవరకు ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదని బాధపడ్డారు. రాజశేఖర్ పెళ్లికి తన భార్య బంగారం కుదవపెట్టి వెళ్ళానని, అక్కడ పోలీసుల చేత దెబ్బలు తిని, స్టేజి ఎక్కి ఫోటోలు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. అభిమానం ఉండాలి, కానీ అది పిచ్చి స్థాయికి వెళ్లకూడదని, అటువంటి పిచ్చి వల్ల కుటుంబం నిర్లక్ష్యం అవుతుందని తర్వాత తెలుసుకున్నానని తడివేలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

జబర్దస్త్ తడివేలు..

Jabardasth Tadivelu, Ali

Jabardasth Tadivelu, Ali

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

Follow Us