Vijay-Rashmika: పెళ్లి తర్వాత ‘పవర్’ ఫుల్ కపుల్‌గా మారనున్న విజయ్ దేవరకొండ- రష్మిక.. ఎలాగంటే?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (ఫిబ్రవరి 26)న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా మరికొన్ని గంటల్లో కొత్త జీవితం ప్రారంభించనున్నారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇక భార్యాభర్తలుగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయనున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక కానుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 24న) సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ ఫంక్షన్, గురువారం (ఫిబ్రవరి 26న) మెయిన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట పెళ్లి తర్వాత ఎలా ఉండనున్నారు? వారి సినిమా కెరీర్ ఎలా ఉండనుంది? అలాగే బిజినెస్ వ్యవహారాల సంగతేంటి? అన్న దానిపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం పెళ్లి తర్వాత రష్మిక- విజయ్ దేవరకొండ టాలీవుడ్ రిచెస్ట్ కపుల్ గా మారనున్నారు. తెలుగు, దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల చేస్తోన్న రష్మిక ఇప్పటివరకు సుమారు రూ.60 నుండి 80 కోట్ల మేరా ఆస్తులు కూడబెట్టిందని తెలుస్తుంది. ఇక విజయ్ విషయానికి వస్తే.. సినిమాల పరంగా ఇప్పుడు కాస్త వెనకపడినప్పటికీ ఈ స్టార్ హీరో నికర ఆస్తుల విలువ 60 – 70 కోట్లు ఉంటుందని సమాచారం. అంటే ఈ ఇద్దరి ఆస్తుల విలువ సుమారు రూ. 140 కోట్ల రూపాయలని తెలుస్తోంది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. బ్రాండ్ ఎండార్స్మెంట్, సోషల్ మీడియా ప్రమోషన్స్ , ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు విజయ్-రష్మిక. స్వరోవ్స్కీ, బోట్, కళ్యాణ్ జువెలర్స్, 7అప్, మీ షో వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా పనిచేస్తోన్న రష్మిక వీటి ద్వారా బాగానే ఆదాయం ఆర్జిస్తోంది. ఇక విజయ్ కూడా రౌడీ వేర్ బ్రాండ్, ఈ – కామర్స్, పాప్ అప్ వెంచర్ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు.
పెరగనున్న బ్రాండ్ ఇమేజ్..
ఈ నేపథ్యంలో రష్మిక- విజయ్ ల పెళ్లి తర్వాత వీరికి మరింత క్రేజ్ పెరగనుందని తెలుస్తోంది. సినిమాల పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఈ కపుల్ బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరగవచ్చు. అలాగే పాన్ ఇండియా కపుల్ ఇమేజ్ ఉండడంతో స్టార్ దర్శకులు, నిర్మాతలు వీరితో సినిమాలు చేయడానికి మరింత ఆసక్తి చూపించవచ్చు. అంతేకాదు వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెరగవచ్చు. మొత్తానికి పెళ్లి తర్వాత టాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో రిచెస్ట్ అండ్ పవర్ ఫుల్ కపుల్స్ లో రష్మిక- విజయ్ జంట కూడా చేరనుందని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




