క్రేజీ కాంబో.. ఇంట్రస్టింగ్ టైటిల్..!
యువ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలను చేసేసిన సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు సీనియర్ల వైపు కూడా మొగ్గుచూపతున్నాడు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘ఎఫ్ 2’ను చేసేసిన రాజు.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు మాత్రం అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్ తెలుగు రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా.. […]

యువ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలను చేసేసిన సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు సీనియర్ల వైపు కూడా మొగ్గుచూపతున్నాడు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘ఎఫ్ 2’ను చేసేసిన రాజు.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు మాత్రం అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
కాగా హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్ తెలుగు రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా.. ఈ మూవీని బాలయ్యతో చేయాలనుకుంటున్నాడట రాజు. అందులో అమితాబ్ కారెక్టర్ బాలయ్యతో చేయించాలన్న పట్టుదలతో ఈ నిర్మాత ఉన్నాడట. దీనికి సంబంధించి బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం లాయర్ సాబ్ అనే టైటిల్ కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే పింక్ మూవీని ఇటీవలే తమిళ్‌లో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. బోని కపూర్ నటించారు. ఈ మూవీపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.