AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగచైతన్య, పరశురామ్‌ సినిమా టైటిల్‌ అదేనా.? ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో చై..

Naga Chaitanya: లవ్‌ స్టోరీ (Love Story), బంగార్రాజు (Bangarraju) వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న నాగచైతన్య వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే థాంక్యూ సినిమాను పూర్తి చేశాడు..

Naga Chaitanya: నాగచైతన్య, పరశురామ్‌ సినిమా టైటిల్‌ అదేనా.? ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో చై..
Naga Chaitanya
Narender Vaitla
|

Updated on: May 28, 2022 | 6:25 AM

Share

Naga Chaitanya: లవ్‌ స్టోరీ (Love Story), బంగార్రాజు (Bangarraju) వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న నాగచైతన్య వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే థాంక్యూ సినిమాను పూర్తి చేశాడు చైతన్య. ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది. క్లాస్‌ లుక్‌లో కనిపించిన నాగ చైతన్య మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా ప్రేక్షకులు ముందుకు రాకముందే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రానికి చైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాతోపాటు పరశురామ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సర్కారు వారి పాట వంటి సూపర్‌ హిట్‌ తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాకు చిత్ర యూనిట్ ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ను ఓకే చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య మధ్య తరగతి అబ్బాయి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మధ్య తరగతి కుర్రాడికి, కంపెనీ సీఈఓ స్థాయిలో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ సినిమా నేపథ్యమనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ పనులు తుది దశలో ఉన్నాయి. స్క్రిప్ట్‌ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..