ఆ సినిమా కోసం నగ్నంగా ఇరవై రోజులు!

హీరోయిన్ అమలాపాల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఆడై’. ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. రతన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టిస్తే.. ఇటీవల విడుదలైన ‘ఆడై’ టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టిస్తోంది. అమలాపాల్ ఒంటరిగా ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలని టీజర్‌లో చూపించడమే ఇందుకు కారణం. ఇక అలాంటి సన్నివేశంలో అమలాపాల్ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. కాగా చిత్రంలో […]

  • Ravi Kiran
  • Publish Date - 8:48 am, Sun, 23 June 19
ఆ సినిమా కోసం నగ్నంగా ఇరవై రోజులు!

హీరోయిన్ అమలాపాల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఆడై’. ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. రతన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టిస్తే.. ఇటీవల విడుదలైన ‘ఆడై’ టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టిస్తోంది. అమలాపాల్ ఒంటరిగా ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలని టీజర్‌లో చూపించడమే ఇందుకు కారణం.

ఇక అలాంటి సన్నివేశంలో అమలాపాల్ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. కాగా చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ కోసం అమలాపాల్ ఏకంగా 20 రోజులు పాటు దుస్తులు లేకుండా నటించిందని సమాచారం. అందుకు అమలాపాల్ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు సమంతా వంటి టాప్ హీరోయిన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజైన కొద్దిగంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఈ చిత్రం ఉండబోతోందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడం వంటి సీన్స్తో పాటు బైక్ పై స్టంట్స్, పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయట. అవి చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. సెన్సార్ బోర్డు నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఇది తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే.