ఇల్లీ బేబి కసరత్తులు.. మెగాస్టార్ కోసమేనా..!

ఇన్ని రోజులు విదేశీయుడితో ప్రేమలో ఉన్న గోవా బ్యూటీ ఇలియానా.. ఇటీవలే అతడితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటోంది. దీంతో కసరత్తులు ప్రారంభించేసింది. ప్రతిరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తోంది. అయితే ఈ కసరత్తుల వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ భామకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చిందట. చిరు హీరోగా కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కబోతున్న […]

ఇల్లీ బేబి కసరత్తులు.. మెగాస్టార్ కోసమేనా..!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 12:40 PM

ఇన్ని రోజులు విదేశీయుడితో ప్రేమలో ఉన్న గోవా బ్యూటీ ఇలియానా.. ఇటీవలే అతడితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటోంది. దీంతో కసరత్తులు ప్రారంభించేసింది. ప్రతిరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తోంది. అయితే ఈ కసరత్తుల వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ భామకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చిందట.

చిరు హీరోగా కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో చిరు సరసన హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. కాజల్, అనుష్క, శృతీ హాసన్, ఐశ్వర్య, నయనతార ఇలా పలువురిని చిరు కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎవరూ ఇంకా ఫైనల్ అయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా పేరు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

చిరు మూవీ కోసం ఈ భామను సంప్రదించారని.. కథ నచ్చి ఇందులో నటించేందుకు ఇలియానా ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే సన్నబడేందుకు కసరత్తులు చేస్తోందని టాక్. మరి ఇందులో నిజమెంతా..? ఇల్లీ బేబి నిజంగానే మెగా ఆఫర్ కొట్టేసిందా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న చిరు 152వ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందుకోసం చిరు కూడా సన్నబడే పనిలో ఉన్నారు. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌