IBOMMA Ravi: పోలీసుల బంపర్ ఆఫర్.. బయటకొచ్చి మరో ఐ బొమ్మ పెడతానన్న రవి.. మామూలు ట్విస్ట్ కాదుగా..
సినీ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. రవి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఐ బొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు..పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు.

సినీ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. రవి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఐ బొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు..పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు. అంతేకాకుండా.. పైరసీ కేసు దర్యాప్తులో పోలీసులు మరింత లోతుగా వెళ్తున్నారు.. ఇంత పెద్ద వలయాన్ని నిర్వహించిన రవిపై పోలీసులు ఇప్పటివరకు రెండు విడతల్లో ఎనిమిది రోజులపాటు కస్టడీ తీసుకుని విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ విచారణలో బయటకు వచ్చిన కొన్ని కీలక సమాచారాలతో కేసు కొత్త మలుపు తిరిగింది. అందుకే తాజాగా పోలీసులు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మొత్తం మూడు వేర్వేరు కేసుల్లో PT వారెంట్ మీద ఇప్పటికే రవిని కోర్టు ఎదుట హాజరుపరచిన సైబర్ క్రైమ్ అధికారులు.. ఇప్పుడు ఈ మూడు కేసులన్నింటికీ ఐదు రోజులపాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుల్లో ఉన్న డిజిటల్ సాక్ష్యాలు, లావాదేవీల రూట్లు, రవి ఇచ్చిన సమాధానాల్లోని లూప్‌హోల్స్ దృష్ట్యా మరింత లోతైన దర్యాప్తు అవసరమని పోలీసులు కోర్టులో వాదించనున్నట్టు తెలిసింది. రవిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగినప్పటికీ, అతను చెప్పిన కొన్ని విషయాలు తాజాగా బయటపడిన వివరాలతో అసలు సరిపోవడం లేదని అధికారులు భావిస్తున్నారు. పైరసీ నెట్‌వర్క్‌ను ఏ విధంగా నడిపాడు? ఎంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బులు చలామణి అయ్యాయి? వేరే దేశాల్లో ఉన్న సర్వర్లతో సంబంధం ఉందా? ఈ విషయాలన్నింటికి పూర్తి క్లారిటీ రావాలంటే మరోసారి కస్టడీ తప్పదని పోలీసులు అంటున్నారు.
అయితే.. సైబర్ క్రైమ్ అధికారులు విచారణలో ఒక ఇన్‌ట్రెస్టింగ్ ప్రశ్న వేసినట్టు సమాచారం.. “సైబర్ క్రైమ్ విభాగంలో మంచి శాలరీతో ఉద్యోగం చేస్తావా?” అని పోలీసులు రవిని అడిగారు.. దీనికి రవి ఒప్పుకోలేదు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కరేబీయన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పినట్లు తెలుస్తోంది.. ఇకపై నేరాలకు, పైరసీకీ దూరంగా సక్రమ మార్గంలో జీవించాలని అనుకుంటున్నట్టు తెలిపాడని పేర్కొంటున్నారు.. రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావని.. ప్రశ్నించగా.. ఐబొమ్మ పేరు పెడతానని సమాధానం ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. “తప్పు చేశానని ఒప్పుకున్నాను.. ఇకపై ఎన్నడూ పైరసీ చేయను” అని రవి కొంత సాఫ్ట్ మోడ్‌లో సమాధానమిచ్చినట్టు సమాచారం..
రవిని వివిధ కోణాల్లో పరీక్షించేందుకు మూడోసారి కస్టడీ అవసరం అని పోలీసులు భావించారు పైరసీ నెట్‌వర్క్‌లో ఇంకా బయటకు రాని వ్యక్తులు ఉన్నారు. రవి ఇచ్చిన డేటాను క్రాస్ చెక్ చేయడానికి మరోసారి అతని విచారణ అవసరమని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు, అంతర్జాతీయ లింకులు, VPN నెట్‌వర్క్‌లో సాగిన కమ్యూనికేషన్ .. ఇవన్నీ రవిని ఎదిరించి అడగాల్సిన ప్రశ్నలే అని తెలుస్తోంది.
మరోవైపు రవి తరఫు న్యాయవాదులు పూర్తిగా వేరే కోణంలో వాదిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని, అప్పటికే పోలీసులు తమకు కావలసిన సమాచారాన్ని తీసుకున్నారని, ఇక మళ్లీ కస్టడీ అవసరం లేదని వాదిస్తున్నారు. రవికి నిర్దోషిత్వ అవకాశాలు ఉన్నాయని, మరింతగా కస్టడీ ఇవ్వడం చట్టవిరుద్ధమని వాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు చెప్పబోతోంది. బెయిల్ రాకపోతే పోలీసులు కోరిన మూడో విడత కస్టడీకి మార్గం సుగమం అవుతుంది. బెయిల్ మంజూరు అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
