Saaho Trailer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన డార్లింగ్

Saaho Trailer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన డార్లింగ్

సాహో’ సినిమాకు తన జీవితంలోని రెండేళ్లు ఇవ్వాలని అనుకోలేదని కథానాయకుడు ప్రభాస్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘సాహో’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో వివరించారు. ఈ సినిమాను రూపొందించడానికి రెండేళ్లు పట్టింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభాస్‌ ‘సాహో’ పనుల్లో బిజీగా గడిపారు. ఈ మధ్యలో ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ సినిమా కూడా ప్రారంభమైంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Aug 12, 2019 | 2:19 PM

సాహో’ సినిమాకు తన జీవితంలోని రెండేళ్లు ఇవ్వాలని అనుకోలేదని కథానాయకుడు ప్రభాస్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘సాహో’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో వివరించారు. ఈ సినిమాను రూపొందించడానికి రెండేళ్లు పట్టింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభాస్‌ ‘సాహో’ పనుల్లో బిజీగా గడిపారు. ఈ మధ్యలో ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ సినిమా కూడా ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘నిజానికి.. ‘సాహో’ సినిమాకు రెండేళ్లు ఇవ్వకూడదని అనుకున్నా. ఎందుకంటే.. ఇప్పటికే ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు ఇచ్చేశాను. కానీ ‘సాహో’ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం చాలా సాధన చేయాల్సి వచ్చింది. అబుదాబిలో షూట్‌ చేసిన సీక్వెన్స్‌ల కోసం దాదాపు ఏడాది కష్టపడ్డాం. ఎంతో సాధన చేశాం. సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్న దర్శకుడు సుజీత్‌, నిర్మాతల కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. మరోపక్క నాది మరో సినిమా ప్రారంభమైంది. దాదాపు 20 రోజుల షూటింగ్‌ జరిగింది. ఇకపైనైనా ఏడాదికి కనీసం రెండు సినిమాలు తీయాలని ఆశిస్తున్నా’ అని ఆయన స్పష్టంచేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu