విరాట పర్వం నుంచి తప్పుకున్న టబు..

విరాట పర్వం నుంచి తప్పుకున్న టబు..

సీనియర్ యాక్ట్రెస్ టబు.. టాలీవుడ్‌‌లో మళ్లీ సందడి షురూ చేసింది. దాదాపు ఒకేసారి రెండు సినిమాలకు ఒకే చెప్పింది. ఒకటి బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే మూవీ.. ఇంకోటి రానా దగ్గుబాటి హీరో వస్తున్న విరాటపర్వం. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకదానికి టబు గుడ్ బై చెప్పారని సమాచారం. తెలుగు సినిమాలకి.. హైదరాబాదీ టబుకి మంచి రిలేషన్ వుంది. గతంలో అందరి హీరోల పక్కన నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారామె. బాలకృష్ణతో నటించిన పాండురంగడు తెలుగులో టబు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2019 | 9:54 PM

సీనియర్ యాక్ట్రెస్ టబు.. టాలీవుడ్‌‌లో మళ్లీ సందడి షురూ చేసింది. దాదాపు ఒకేసారి రెండు సినిమాలకు ఒకే చెప్పింది. ఒకటి బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే మూవీ.. ఇంకోటి రానా దగ్గుబాటి హీరో వస్తున్న విరాటపర్వం. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకదానికి టబు గుడ్ బై చెప్పారని సమాచారం. తెలుగు సినిమాలకి.. హైదరాబాదీ టబుకి మంచి రిలేషన్ వుంది. గతంలో అందరి హీరోల పక్కన నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారామె. బాలకృష్ణతో నటించిన పాండురంగడు తెలుగులో టబు చివరి సినిమా. ఇది రిలీజై దాదాపు పదేళ్లు దాటింది. దశాబ్దం గాప్‌లో ఆమె కెరీర్ బాలీవుడ్‌లో బలంగానే ఉంది. రీసెంట్‌గా అంధాదూన్, దేదేప్యార్‌దే మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు. అదే క్రేజ్‌ని క్యాస్ చేసుకోవడానికి తెలుగులో కూడా రీ ఎంట్రీ ప్లాన్ చేసింది అమ్మడు. వేణు ఉడుగుల డైరెక్షన్‌లో విరాటపర్వం అనే పీరియాడిక్ మూవీలో కీరోల్ దక్కించుకుంది. ఇందులో టబుది మహిళా నక్సలైట్ పాత్ర. అయితే రానాకి అనారోగ్యం అంటూ షూటింగ్‌కి బ్రేక్ పడింది. దీంతో నా డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయి అంటూ టబు విరాటపర్వం ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకుందట. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ అమ్మడు భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా టబుకి బదులుగా నందితాదాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu