‘మన్మథుడు 2’..నవ్వులే నవ్వులు..అమల ట్వీట్!

‘మన్మథుడు 2’..నవ్వులే నవ్వులు..అమల ట్వీట్!

హైదరాబాద్‌: ‘మన్మథుడు 2’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానంటున్నారు నాగర్జున భార్య అమల అక్కినేని.  ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. సినిమా మంచి ఫన్ మోడ్‌లో ఉందని అన్నారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్‌ చిత్రం. అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘మన్మథుడు 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.5.03 కోట్ల షేర్‌ సాధించిందని […]

Ram Naramaneni

|

Aug 11, 2019 | 2:35 AM

హైదరాబాద్‌: ‘మన్మథుడు 2’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానంటున్నారు నాగర్జున భార్య అమల అక్కినేని.  ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. సినిమా మంచి ఫన్ మోడ్‌లో ఉందని అన్నారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్‌ చిత్రం. అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.

‘మన్మథుడు 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.5.03 కోట్ల షేర్‌ సాధించిందని మూవీ యూనిట్ తెలిపింది.  రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. లక్ష్మి, ఝాన్సి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత, కీర్తి సురేశ్‌ అతిథి పాత్రల్లో కనిపించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.  శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu