Isha Ambani: అమెరికాలో ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లకో తెలుసా?
ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో తన విలాసవంతమైన ఇంటిని విక్రయించింది. హాలీవుడ్‌కు చెందిన స్టార్ కపుల్ ఈ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేశారు. ఇంతకీ ఇషా అంబానీ బంగ్లా ఎన్ని కోట్లకు అమ్ముడైందో తెలుసా?
ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన తండ్రిలాగే మంచి పారిశ్రామికవేత్తగా ముద్ర వేసుకుంది. ఇషా అంబానీకి భారత్‌తో సహా అనేక దేశాల్లో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. అయితే తాజాగ ఆమె అమెరికాలోని తన విలాసవతమైన ఇంటిని విక్రయించింది. హాలీవుడ్‌లోని ప్రముఖ జంట ఇషా అంబానీ ఇంటిని కొనుగోలు చేసింది. అది కూడా భారీ ధరకే. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హాలీవుడ్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఇషా అంబానీకి భారీ ఇల్లు ఉంది. 5.2 ఎకరాల్లో విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన ఈ ఇల్లు ఇషా అంబానీ పేరు మీదగానే ఉంది. సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ ఇంటిని కొనుగోలు చేశారామె. అయితే ఈ లగ్జరీ ఇంట్లో ఇషా అంబానీ ఈ ఇంట్లో చాలా తక్కువ కాలం మాత్రమే ఉన్నారు. గర్భంతో ఉన్నప్పుడు అంటే 2022లో ఇషా ఇక్కడే గడిపారు. ఆ సమయంలో ఆమె తల్లి అనితా అంబానీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు అమ్ముడుపోయింది. ఈ ఇంటిని గత ఐదేళ్లుగా అమ్మకానికి ఉంచారు. చివరకు హాలీవుడ్ స్టార్ కపుల్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ ఈ ఇంటిని రూ. 508 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అలాగే విశాలమైన స్విమ్మింగ్ పూల్, పికిల్ బాల్ కోర్ట్, విశాలమైన వినోద ప్రదేశం, సెలూన్, ప్రైవేట్ జిమ్, విశాలమైన డైనింగ్ ఏరియాతో పాటు అనేక ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
హాలీవుడ్ స్టార్ నటుల్లో బెన్ అఫ్లెక్ ఒకరు. అతను ఆస్కార్ విజేత ‘అర్గో’, ‘గాన్ గర్ల్’ సహా పలు టాప్ హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. బెన్ అఫ్లెక్ ‘జస్టిస్ లీగ్’ సినిమా సిరీస్‌లో బ్యాట్‌మ్యాన్ పాత్రను కూడా పోషించాడు. ఇక అతని భార్య జెన్నిఫర్ లోపెజ్, పాప్ ప్రపంచంలో అతిపెద్ద స్టార్. ఈమెకు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది.
జెన్నిఫర్ లోపెజ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.