షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. గన్ పేలడంతో మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి..

సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ చాలా కష్టపడుతుంటారు.. ఒక సినిమా వెనక వందలాది మంది కృషి ఉంటుంది. సినిమా సెట్స్‌‌లో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి

షూటింగ్‌లో ఊహించని ప్రమాదం.. గన్ పేలడంతో మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి..
Shooting
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:47 PM

సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ చాలా కష్టపడుతుంటారు. ఒక సినిమా వెనక వందలాది మంది కృషి ఉంటుంది. సినిమా సెట్స్‌లో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. కొన్ని సమయాల్లో హీరోలు, హీరోయిన్లు, ఇతర చిత్రబృందం ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో అనికొని ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన డమ్మీ గన్ పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగింది మనదగ్గర కాదు హాలీవుడ్ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ పేలింది. దాంతో మహిళా సినిమాటోగ్రాఫర్ ప్రాణాలు కోల్పోయింది. హాలీవుడ్ లో ‘రస్ట్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్ విన్ చేతిలోని డమ్మీ తుపాకీ పేలింది.  దాంతో అక్కడే ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. Cinematographerగన్ పేలడంతో ఇద్దరిని వెంటనే హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. హల్యానా హచిన్స్  మరణించారు. తీవ్రంగా గాయపడిన డైరెక్టర్ జోయల్ సౌజా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్ లో జరిగింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని తెలుస్తుంది. Hero

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amala Paul Photos: కుర్రకారుని కవిస్తున్న ‘అమలా పాల్’ ఫోజులు.. ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోషూట్..

Actress Nadhiya photos: యంగ్‌డైనమిక్ లుక్‌లో కవ్విస్తున్న అలనాటి తార.. ‘నదియా’ లేటెస్ట్ ఫొటోస్..

Anupama Parameswaran: అనుపమ ఆలింగనం చేసుకున్న ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా…?