ప్రభాస్‌తో చిందేయనున్న హాలీవుడ్ పాప్ సింగర్
‘బాహుబలి’ భారీ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగా బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ పాప్ సింగర్ కైలీ మినోగ్, సాహోలో స్పెషల్ […]

‘బాహుబలి’ భారీ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్లుగా బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.
బ్రిటీష్ పాప్ సింగర్ కైలీ మినోగ్, సాహోలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. 2009లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బ్లూ’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించిన కైలీ.. పదేళ్ల తరువాత మరో భారతీయ సినిమాలో కనిపించనుంది. కాగా ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్-ఇషాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.