‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై హైకోర్టు ఏం చెప్పిందంటే..!

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీలో ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలంటూ ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు హైకోర్టు సూచించింది. అయితే ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న విడుదల అయింది. ప్రతి చోట ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఏపీ […]

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’పై హైకోర్టు ఏం చెప్పిందంటే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 15, 2019 | 4:21 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీలో ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలంటూ ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు హైకోర్టు సూచించింది.

అయితే ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న విడుదల అయింది. ప్రతి చోట ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఏపీ ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తైన తరువాత అయినా సినిమా విడుదల అవుతుందని భావించారు. కానీ ఎన్నికలు పూర్తై నాలుగు రోజులు కావస్తున్నా ఈ మూవీ విడుదలపై క్లారిటీ రావడం లేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu