Tollywood: గుర్తుపట్టారా..? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ ఆడిస్తోంది..

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. అగ్రతారల పక్కన యాక్ట్ చేస్తూ దుమ్ము రేపుతోంది. మీకు రెండు క్లూలు ఇస్తాం.. ఒకటి తను తెలుగమ్మాయే.. రెండు.. తను డ్యాన్స్‌ తోపు. ఇప్పుడైనా ఏమైనా ఐడియా వచ్చిందా...?

Tollywood: గుర్తుపట్టారా..? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ ఆడిస్తోంది..
Actress old Pic
Follow us

|

Updated on: Jun 19, 2024 | 1:54 PM

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఏళ్లపాటు నెగ్గుకురావడం అంటే మాములు విషయం కాదు. అందం, అభినయంతో పాటు క్రమశిక్షణ, నిరంతరం నేర్చుకునే తవ్వం వంటి లక్షణాలు ఉండాలి. అలా కాకుండా ఏదో బండి లాంగిచేద్దాం అనుకుంటే నాలుగు సినిమాల తర్వాత షెడ్డుకు వెళ్లిపోవాల్సిందే. ఇక చిన్నప్పడు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవారికి కొన్ని ఫేవర్స్ ఉంటాయ్. వారికి కొన్ని ఫేవర్స్ ఉంటాయి. కెమెరా ఫీయర్ అస్సలు ఉండదు. యాక్టింగ్‌లో అన్ని మెలుకువలు కూడా తెలిసి ఉంటాయ్. అలా చైల్డ్ ఆర్టిసులుగా వచ్చి.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అప్పటి శ్రీదేవి నుంచి నిన్నమొన్నటి కావ్య కల్యాణ్ రామ్ వరకు అదే బ్యాచ్. పైన మీరు చూస్తున్న అమ్మాయి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా..?

ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా చెలామణి అవుతుంది. అమ్మడి డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. ఒక ఏడాది వరకు ఆమె డేట్స్ అస్సలు ఫిల్ అయిపోయాయ్. అంతలా ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీ మరెవరో కాదు మన శ్రీలీల. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే అండీ.. తను మన తెలుగమ్మాయి శ్రీలీల. చాలామంది శ్రీలీల ఫస్ట్ తెలుగు సినిమా పెళ్లి సందడి అనుకుంటారు. కానీ అంతకంటే ముందే బాలనటిగా ఓ మూవీలో నటించింది. అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రాంగద సినిమాలో సింధు తులానీ చిన్నప్పటి పాత్రలో కనిపించింది శ్రీలీలనే.

ఇప్పుడు ఫేస్‌కట్స్ బాగా గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. MBBS చదువుతున్న ఈ డాక్టరమ్మ.. కన్నడ మూవీ కిస్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భారతే అనే సినిమాలో యాక్ట్ చేసింది . రెండేళ్ల గ్యాప్ తీసుకుని పెళ్ళి సందడి మూవీతో తెలుగులోకి వచ్చింది. ఆ సినిమాలో అమ్మడి లుక్స్‌కు, డ్యాన్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకాలో శ్రీలీల నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస పెట్టి ఛాన్సులు అందుకుంది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. వీటిల్లో గుంటూరు కారం, భగవంత్ కేసరి బాగా ఆడాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం చదువుపై ఫోకస్ పెట్టిన ఈ భామ.. ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకోవట్లేదు.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.