కరోనా వైరస్.. హీరోయిన్ ప్రణీత చేస్తోన్న సేవను మెచ్చుకోవాల్సిందే..!

కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ పలువురు సెలబ్రిటీలు సామాజిక సేవ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఇంట్లో వంటలను చేయించి నిరాశ్రయులైన వారికి అందిస్తున్నారు. మరికొందరేమో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూట గడవని వారికి, రోజువారీ కూలీలకు తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించిన హీరోయిన్‌ ప్రణీత సుభాష్.. మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకుంది. పేద ప్రజల కోసం ఆమె ఆహారాన్ని […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:59 pm, Sun, 26 April 20
కరోనా వైరస్.. హీరోయిన్ ప్రణీత చేస్తోన్న సేవను మెచ్చుకోవాల్సిందే..!

కరోనా వైరస్ లాక్‌డౌన్ వేళ పలువురు సెలబ్రిటీలు సామాజిక సేవ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఇంట్లో వంటలను చేయించి నిరాశ్రయులైన వారికి అందిస్తున్నారు. మరికొందరేమో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూట గడవని వారికి, రోజువారీ కూలీలకు తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున 50కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించిన హీరోయిన్‌ ప్రణీత సుభాష్.. మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకుంది.

పేద ప్రజల కోసం ఆమె ఆహారాన్ని తయారుచేయించి పంపిణీ చేస్తున్నారు. తాజాగా వాటికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో వంటను వండటంతో పాటు ప్యాకెట్లలో ప్యాక్‌ చేస్తున్నారు. ఇక వీటిని చూసిన నెటిజన్లు ప్రణీతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేవలం ఇంటికే పరిమితం కాకుండా తనవంతు సామాజిక సేవ చేస్తూ ప్రణీత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం చిరంజీవి సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ)ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ ఛారిటీకి తమ తరఫున సహాయం చేస్తున్నారు.

Read This Story Also: మాంసం అమ్మకాలపై తనిఖీ.. పలు షాపులు సీజ్‌..!

https://www.instagram.com/p/B_Z3k3XArNI/