మాంసం అమ్మకాలపై తనిఖీ.. పలు షాపులు సీజ్‌..!

కరోనా కేసులు పెరగుతోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విజయవాడలో కేసులు అమాంతం పెరగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

మాంసం అమ్మకాలపై తనిఖీ.. పలు షాపులు సీజ్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 1:25 PM

కరోనా కేసులు పెరగుతోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విజయవాడలో కేసులు అమాంతం పెరగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజున విజయవాడలో షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆదేశాలను ఉల్లఘిస్తూ మాంసం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీఎంసీ అధికారులు వాటిపై కొరడా ఝులిపించారు. ఉదయం 5 గంటల నుంచి నాన్ వెజ్ అమ్మకాలపై అధికారులు తనిఖీ చేపట్టారు.

రాజీవ్ నగర్, పాయకాపురం, జక్కంపూడి, సింగ్ నగర్, వాంబే కాలనీ, నిజాం గెట్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రోడ్డు మీద అమ్మకాలు చేపడుతున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే షాపులను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో 2 టన్నుల చేపలు, 300 కేజీల చికెన్, 100 కేజీల మటన్‌ను సీజ్‌ చేశారు. జక్కంపూడి కాలనిలోని ఎస్ ఎస్ నాయుడు చికెన్ షాప్‌లో కుళ్లిన చికెన్ అమ్మటాన్ని గుర్తించిన అధికారులు లైసెన్స్ రద్దు చేశారు.

Read This Story Also: ఆ గ్రంథంలో కరోనాకు విరుగుడు గురించి ఉంది: గరికపాటి