AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trolls on Varun Dhawan : వరుణ్ ధావన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్… నెటిజన్లుకు షాక్ ఇచ్చిన హీరో

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. సెలబ్రిటీలు అభిమానులకు మరింత దగ్గరై పోయారు.  సోషల్ మీడియా ద్వారా కొందరు..

Trolls on Varun Dhawan : వరుణ్ ధావన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్... నెటిజన్లుకు షాక్ ఇచ్చిన హీరో
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2020 | 5:08 PM

Share

Trolls on Varun Dhawan : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. సెలబ్రిటీలు అభిమానులకు మరింత దగ్గరై పోయారు.  సోషల్ మీడియా ద్వారా కొందరు తారలు చేదు అనుభవాలను కూడా ఎదురుకుంటున్నారు. సినిమా హీరోలు, హీరోయిన్ల్ నిత్యం ఎదోరకంగా నెటిజన్ల చేత ట్రోల్ కు గురవుతూనే ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వంతు వచ్చింది. ఈ యంగ్ హీరో ఇటీవల ‘కూలీ నెం1’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సినిమాలో వరుణ్ ఓవరాక్షన్ చేశాడంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమాకు వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకుడిగా వ్యవహరించారు. సారా అలీఖాన్ హీరోయిన్ గా నటించింది. అయితే వరుణ్ సీన్లు కొన్ని ఓవర్ గా ఉన్నాయంటూ నెటిజన్లు వరుణ్ పైన అతడి తండ్రి,దర్శకుడు డేవిడ్ ధావన్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సీన్ లో ఓ చిన్నపాప రైలు పట్టాలపైన కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో రైలు వస్తుంది. అక్కడ ఉన్నవారంతా రైలు వస్తుందని భయంతో కేకలు వేస్తారు. అదే సమయంలో హీరో వంతెన పైనుంచి రైలు మీదకు దూకి వేగంగా వెళ్తున్న రైలు పైన పరిగెడుతూ.. ఇంజన్ వద్దకు చేరుకుంటాడు. అక్కడి నుంచి పట్టాలమీదకు దూకి ఆ చిన్నపాపను కాపాడుతాడు. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. వరుణ్ సినిమాలో కూలీ కాదు సూపర్ మ్యాన్ అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే వరుణ్ ధావన్ నటించిన ‘బదలాపూర్’ సినిమాలో అతడి యాక్టింగ్ కు మంచి పేరు వచింది. కానీ ఈ సినిమాలో ఓవర్ యాక్టింగ్ చేశాడంటూ ఆ రెండు సినిమాలు ఫోటోలను జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ గా ఉన్న తండ్రి చెప్పిందే వరుణ్ చేశాడంటూ హీరో పట్ల సానుభూతి చూపుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ట్వీట్ కి వరుణ్ ధావన్ లైక్ కొట్టాడు.

Also read:

Real hero producing movies: నిర్మాణ రంగంలోకి ‘రియల్ హీరో’.. హీరోగా కూడా నటిస్తాడా.?