Real hero producing movies: నిర్మాణ రంగంలోకి ‘రియల్ హీరో’.. హీరోగా కూడా నటిస్తాడా.?

Sonusood turns as producer: లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వసల కూలీలకు అండగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించాడు సోనూసూద్. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా మారి ఎంతో మందికి...

Real hero producing movies: నిర్మాణ రంగంలోకి ‘రియల్ హీరో’.. హీరోగా కూడా నటిస్తాడా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2020 | 4:38 PM

Sonusood turns as producer: లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించాడు సోనూసూద్. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా మారి ఎంతో మందికి సహాయాన్ని అందించాడు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇక సోనూ సూద్ చేస్తున్న మంచి పనులకు అభిమానులు కూడా బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. సోనూసూద్‌కు ఏకంగా దేవయాన్ని నిర్మించారు. దీంతో సోనూను సినిమాల్లో నెగిటివ్‌గా చూపిస్తే ప్రేక్షకులు ఆమోదించరనే స్థాయికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మించనున్నాడు. తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు మీద నెలకొల్పిన శక్తి సాగర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సినిమాలు చేయనున్నాడు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ.. స్ఫూర్తిని కలిగించే కథలతో సొంత బ్యానర్‌లో సినిమాలు తీయనున్నట్లు తెలిపాడు. ఇక సోనూసూద్ తాను స్వయంగా నిర్మించే సినిమాల్లో హీరోగా నటించనున్నాడని సమాచారం. విలన్‌గా విలక్షణ నటనతో ఆకట్టుకున్న సోనూసూద్.. హీరో, ప్రొడ్యుసర్‌గా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటాడో చూడాలి. Also read: Sonu Sood: సోనూసూద్‏కు అగ్రస్థానం.. హాలీవుడ్ సెలబ్రెటీ‏లను దాటేసిన రియల్ హీరో..