AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. ‘ఏరా.. సిగ్గుండాలి’ అంటూ..

హీరో సిద్ధార్థ్ ను కొంతమంది రాజకీయ నాయకులు టార్గెట్ చేసారని ఆయన అభిమానులు అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు.

Actor Siddharth : బీజేపీ నేత ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. 'ఏరా.. సిగ్గుండాలి' అంటూ..
Hero Siddharth Coments
Rajeev Rayala
|

Updated on: May 07, 2021 | 10:59 AM

Share

Actor Siddharth :  హీరో సిద్ధార్థ్ ను కొంతమంది రాజకీయ నాయకులు టార్గెట్ చేసారని ఆయన అభిమానులు అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. గతంలో కొంతమంది పొలిటీషియన్స్ పైన సిద్ధార్థ్ తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. ఈ క్రమంలోనే తన పైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి తాజాగా ట్విట్టర్ లో ఘాటుగా రిప్లై ఇచ్చాడు సిద్ధార్థ్. సినిమా వాళ్లకు మాఫియాడాన్ లు డబ్బులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు దానికి సమాధానం చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దానికి ఘాటుగా రిప్లైఇచ్చాడు సిద్ధార్థ్.

దావూద్ ఇబ్రహీం నా టీడీఎస్ చెల్లించలేదన్నారు సిద్ధార్థ్. తాను క్రమం తప్పకుండా టాక్స్ కడతానని, తనకు ఏ మాఫియాడాన్ టాక్స్ కట్టారు అని సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా..విష్ణువర్ధన్ రెడ్డిని ఏరా.. అంటూ సంబోదించాడు. వెళ్లి పడుకో..బీజేపీ స్టేట్ సెక్రెట్రీ అంట సిగ్గుండాలి అంటూ.. ట్వీట్ చేశారు సిద్దార్థ్. గత కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో నిర్లక్యంగా వ్యవహరిస్తోందటూ విమర్శలు  చేస్తున్నారు సిద్ధార్థ్. ఈ మధ్య తనను, తన కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించాడు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ -బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Athreya : మనసుమీద మనసుపడ్డ మహామనిషి ఆచార్య ఆత్రేయ

G Anand passed away : మహమ్మారి కాటుకు మరో సీనియర్ సింగర్ బలి.. కరోనాతో కన్నుమూసిన జి. ఆనంద్ ..

Vishal Movie: శరవణన్‌ దర్శకత్వం విశాల్.. షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్..