ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.. సంపూర్ణేష్ బాబు కుటుంబానికి గాయాలు
టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో ఆయన ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి గాయాలయ్యాయి. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంపూ కుటుంబాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా డ్రైవర్ నిర్వాకం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించినట్లు […]

టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో ఆయన ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి గాయాలయ్యాయి. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంపూ కుటుంబాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా డ్రైవర్ నిర్వాకం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ సంఘటనపై సంపూర్ణేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం వలన తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం డ్రైవర్ నిర్వాకంతో హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.