AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సరిలేరు నీకెవ్వరు’తో దేవీ కోరిక తీరబోతోందట..!

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు డీఎస్పీ. ‘సరిలేరు నీకెవ్వరు’తో […]

'సరిలేరు నీకెవ్వరు'తో దేవీ కోరిక తీరబోతోందట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 27, 2019 | 2:01 PM

Share

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు డీఎస్పీ. ‘సరిలేరు నీకెవ్వరు’తో తన కోరిక తీరబోతోందని ఆయన తెలిపాడు. ఇంతకు డీఎస్పీ కోరిక ఏంటి..? అనుకుంటున్నారా..! ఇప్పటివరకు ఎన్నో మరిచిపోలేని మెలోడీలు, టైటిల్ సాంగ్‌లు, స్పెషల్ సాంగ్‌, మాస్‌ సాంగ్‌లు ఇచ్చిన దేవీ.. కొన్ని ట్రిబ్యూట్ పాటలు కూడా ఇచ్చాడు. ‘ఓ బాబు నువ్వే రావాలి’ అంటూ గాంధీకి.. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ నాన్నలందరికీ.. ‘వందేమాతరం’ అంటూ దేశానికి.. ‘గురుబ్రహ్మ గురు విష్ణు’ అంటూ గురువులందరికీ.. ‘నీరు నీరు నీరు రైతు కంట నీరు’ అంటూ రైతులకు.. ఇలా పలు పాటలను ఆయన కంపోజ్ చేశాడు. ఇక ఈ పాటలన్నీ అందరినీ చాలా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ‘ఫాదర్స్ డే’ వచ్చినప్పుడు ‘నాన్నకు ప్రేమతో’.. ‘స్వాతంత్య్ర దినోత్సవం’, ‘గణతంత్య్ర దినోత్సవం’ వచ్చినప్పుడు వందేమాతరం పాటలు ఇప్పటికీ టీవీల్లో వినిపిస్తూనే ఉంటుంది.

అలాగే ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా అలాంటి ఓ ట్రిబ్యూట్ పాటను సిద్ధం చేశాడట దేవీ. ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఓ పాట చేయాలని తాను ఎప్పుడూ అనుకుంటుండేవాడినని.. ‘సరిలేరు నీకెవ్వరు’తో ఆ కోరిక తీరిందని ఇటీవల చెప్పుకొచ్చాడు రాక్‌స్టార్. ఇక ఈ పాటకు సంబంధించిన పల్లవిని ఆగష్టు 15నే విడుదల చేయగా.. పూర్తి పాట అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు దేవీ. అంతేకాదు ఈ మూవీ ప్రారంభం సమయంలో ఈ సినిమాలో మహేష్‌ అభిమానుల కోరిక తీరుస్తానని.. మంచి మాస్ పాటను ఇస్తానన్న దేవీ ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి దేవీ ఊపు చూస్తుంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్బమ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.